end
=
Wednesday, January 22, 2025
క్రీడలువచ్చే ఏడాది ఐపీఎల్‌ జట్లు పెరగొచ్చు: ద్రవిడ్
- Advertisment -

వచ్చే ఏడాది ఐపీఎల్‌ జట్లు పెరగొచ్చు: ద్రవిడ్

- Advertisment -
- Advertisment -

వచ్చే ఐపీఎల్‌(ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌) సీజన్‌లో రెగ్యులర్‌ జట్ల కంటే ఎక్కువ జట్లు తలపడే అవకాశాలున్నాయంటున్నాడు దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రావిడ్. ఎనిమిది జట్లకు అదనంగా మరో జట్టు జతకలిసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో టాలెంట్ఉ న్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారనీ.. వారికి సరైన అవకాశం లభించక వెలుగులోకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. జట్లు గనుక పెంచితే కొత్త ఆటగాళ్లు తెరపైకి వస్తారని, తద్వారా వారి ఆశయం కూడా నెరవేరుతుందని ఈ మిస్టర్‌ డిపెండబుల్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇది చాలా కీలకమైన విషయం గనుక బీసీసీఐ అధికారికంగా తెలియజేస్తుందన్నాడు. ప్రస్తుతమున్న ఎనిమిది జట్లను వచ్చే సీజన్‌ వరకు తొమ్మిదికి పెంచి, 2023 నాటికి జట్ల సంఖ్య 10కి పెంచొచ్చని బీసీసీఐ ఇన్‌సైడ్‌ టాక్‌. కాగా, రాహుల్‌ ద్రావిడ్ ఇండియా-ఏ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎంతో మంది యువ ఆటగాళ్లు భారత జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఇదంతా రాహుల్‌ సార్ సలహాల వల్లే సాధ్యమైందని ఆయా ఆటగాళ్లు స్వతహాగా చెప్పడం మనం ఇది వరకే చూశాం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -