end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌One Night Stand:‘వన్ నైట్ స్టాండ్’ తప్పా? ఒప్పా?
- Advertisment -

One Night Stand:‘వన్ నైట్ స్టాండ్’ తప్పా? ఒప్పా?

- Advertisment -
- Advertisment -

 One Night Stand: ‘వన్-నైట్ స్టాండ్’ అనే పాశ్చత్య సంస్కృతి(Western Culture) దాదాపుగా ఒక వ్యభిచారం లాంటిది. సెక్స్‌(Sex) లో పాల్గొనేవారి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండకూడదనేది దీని కాన్సెప్ట్. అయితే దీన్ని ‘భావోద్వేగ నిబద్ధత లేదా భవిష్యత్తు ప్రమేయం లేకుండా జరిగే లైంగిక చర్య’గా చెప్పుకొవచ్చు. సాధారణంగా భారతదేశంలో పెళ్లికి ముందు ప్రియురాలితో శృంగారం(Romance) సాధారణమే. కానీ, సింగిల్‌గా ఉంటూ పరిచయం లేని మహిళ లేదా పురుషుడు ఒక రాత్రి సెక్స్(Sexual Relation) కోసం గడపడాన్ని‘వన్ నైట్ స్టాండ్’గా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు ఫారిన్ కంట్రీస్‌కే పరిమితమైన ఈ ట్రెండ్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.

(Hug: ఒక్క కౌగిలింతతో అన్నీ దూరం)

అయితే ఇందులో ఒక రాత్రికోసం సంభోగంలో(Intercourse) పాల్గొనే వ్యక్తి గురించిన వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం లేకపోగా.. పరస్పర పరిగణనలతో ప్రేమికుడిని కనుగొనడం కంటే వన్-నైట్ స్టాండ్ చాలా ప్రమాదకరం. అతనికి లేదా ఆమెకు అనుకూలంగా అసమానతలను కలిగి ఉన్న వ్యాపార ప్రయాణీకులు, ఎక్కువ ట్రావెలింగ్ చేసే వ్యక్తులు తమకు పరిచయమయ్యే ఒంటరి మహిళలు, లేదా పురుషులతో ఈ అనుభూతి పొందుతున్నారు. అలాగే ఉద్యోగాలు చేస్తూ కుటుంబికులకు దూరంగా ఉంటున్న యువత కూడా ‘వన్ నైట్ స్టాండ్’ వైపు మొగ్గు చూపుతోంది. కానీ, ఈ ప్రక్రియలో మీరు ఎవరితో కాల్సిఉంటున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కేవలం ఒక రాత్రి సంతోషం కోసం చేసే ఈ పని భవిష్యత్తులో రాబోయే భాగస్వామికి, లేదా వ్యక్తిగతంగా మీ ఆరోగ్యానికి హాని(Danger) కలిగించవచ్చు.

అయితే, ‘వన్ నైట్ స్టాండ్’ అనేది ఆయా వ్యక్తుల అభిరుచి(Passion)పై కూడా ఆధారపడి ఉంటుంది. కొంతమంది పక్కా ప్లాన్‌తో సెక్స్ అనుభూతి పొందుతారు. మరికొందరు అనుకోకుండా కొత్త వ్యక్తులతో సెక్స్‌లో పాల్గొని, వారితో తిరిగి ఎలాంటి సంబంధం కొనసాగించరు. ‘వన్ నైట్ స్టాండ్’ అనేది ఒకరి కోరిక మాత్రమే కాకపోగా ఇరువురికి ఇష్టమైతేనే సాధ్యమవుతుంది. అయితే కొంతమంది ఒకసారి సెక్స్ అనుభూతి పొందిన తర్వాత ఒక రాత్రికే కట్టుబడి ఉండకపోగా.. తనతో సెక్స్ చేసే పార్టనర్ నచ్చితే ఏళ్ల తరబడి సంబంధం కొనసాగిస్తారు. ఇది భవిష్యత్తులో ఇబ్బందులను(Difficulties) కూడా తెచ్చి పెడుతుంది. ఎందుకంటే.. ‘వన్ నైట్ స్టాండ్’లో లభించే భాగస్వామి.. అతడు లేదా ఆమెను మనస్ఫూర్తిగా నమ్మే అవకాశం ఉండకపోగా ఇది డేటింగ్ వెబ్‌సైట్ల ద్వారా వీపరీతంగా వెలుగులోకి వచ్చింది.

ఇక బ్రిటీష్ అధ్యయనం ప్రకారం.. విస్తృతమైన ‘హిప్స్’ఉన్న మహిళలు ఆహ్లాదకరమైన క్యాజువల్ సెక్స్‌(Casual Sex)లో ఎక్కువగా పాల్గొంటారని వెల్లడైంది. ఇలాంటి స్త్రీలు ఎక్కువ సంఖ్యలో వన్-నైట్ స్టాండ్‌లను కలిగి ఉంటున్నారని, ఎందుకంటే వారి నడుము, బటక్స్ సైజ్ పురుషులను లేదా భాగస్వామిని ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఇలాంటి బాడీ స్ట్రక్చర్ కలిగివున్న మహిళలు పూర్తి స్థాయిలో తమ లైఫ్ పార్ట్‌నర్‌తో సెక్స్‌లో పాల్గొనడానికి తక్కువ అవకాశం ఉంటుంది.

(మనసుకు నచ్చింది చేస్తేనే బతుక్కి అర్థం కదా..)

ముఖ్యంగా నిరంతరం నిరుత్సాహపరిచే(Disappointing) ఆలోచనలతో పోరాడుతున్న వ్యక్తులు అర్థరహితమైన వన్-నైట్ స్టాండ్‌లకు వెళతారు. బలహీనమైన మానసిక ఆరోగ్యం లేదా ఆత్మగౌరవం లేని వాళ్లలో ఇలాంటి పనులు చేసేందుకు ఈ సంస్కృతి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే  తమకు తెలియని వ్యక్తులో సెక్స్ చేయడం ద్వారా చెప్పలేని ఆనందాన్ని పొందుతామని బలంగా నమ్ముతారు. చివరగా ఈ వన్ నైట్ స్టాండ్‌లో పెళ్లైన పురుషులు, లేదా స్త్రీలు తమ భాగస్వామితో సంభోగాన్ని ఆనందించలేనప్పుడు కొత్త వ్యక్తులతో కోరిక తీర్చుకోవడానికి ఈ పద్దతిని ఎంచుకుంటారు. ఆ ఒక్క రాత్రి పాల్గొనే రతి క్రీడలో తమకు నచ్చి భంగిమలు, ఫోర్ ప్లే వంటి తదితర కోరికలన్నీ తీర్చుకుని ఉపశమనం పొందుతున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -