end

Pregnancy:కడుపులో శిశువు కదులుతుందా.. అయితే ట్రాకింగ్

  • 16 – 25 వారాల మధ్య బేబీ ఫస్ట్ మూమెంట్
  • బిడ్డ పెరుగుదల ఆధారంగా వేర్వేరు అనుభూతులు
  • 24వ వారం నాటికి కదలిక లేకుంటే అబ్‌నార్మల్
  • మొదటిసారి గర్భవతులకు నిపుణుల సలహాలు

గర్భంలో (pregnancy) పెరుగుతున్న బిడ్డ (Baby) బయటి ప్రపంచంలో అడుగుపెట్టక ముందు కడుపులో మొదటిసారి(first time)  కదిలినప్పుడు తల్లులు (mothers)  పొందే అనుభూతిని (feeling) మాటల్లో చెప్పలేం. గర్భధారణలో (pregnant) ఇదొక మైలురాయిగా చెప్పుకోవచ్చు. అదే సెకండ్ ప్రెగ్నెన్సీ (second pregnancy) టైమ్‌లో శిశువు కదలిక నుంచి ఏమి ఆశించాలో అప్పటికే తెలిసి ఉంటుంది. అయితే కొత్త తల్లులకు.. శిశువు ఇలా కదలిక నమూనా స్థాపించే వరకు పరిస్థితులను అర్థం చేసుకోవడం సవాల్‌గా ఉంది. ఉదాహరణకు, కడుపులో శిశువు ఎందుకు కదులుతుందో తెలియక ఆందోళన (disquiet) చెందుతుంటారు. అయితే కడుపులో (Stomach) బిడ్డ కదలికల పరంగా ఏది సాధారణమైనది? ఏది కాదు? అనే విషయాలను ప్రముఖ ఆబ్‌స్టెట్రిషియన్ (Obstetrician), గైనకాలజిస్ట్ (Gynecologist) వివరించారు.

గర్భవతుల శరీరంలో శిశువు కదలిక (movements)భావన గర్భధారణతో పాటు వచ్చే అనేక ఉత్తేజకర విషయాల్లో ఒకటి. మొదట ఇది అసౌకర్యం (Inconvenience)తో కూడిన అనుభూతిని కలిగిస్తుంది. కానీ సహజంగానే అలవాటవుతుంది. తల్లి కడుపులో శిశువు కదలికలు పూర్తిగా సాధారణమైనప్పటికీ.. ఏదైనా సరిగ్గా లేదని భావిస్తే వైద్యుడిని (doctor) సంప్రదించవచ్చు. ఇందుకు సంబంధించి కింది అంశాలను గమనించాల్సిన (observed) అవసరముంది.

(Diabetes:రక్తంలో షుగర్ లెవల్స్‌ని సహజంగా తగ్గించడం ఎలా???)

గర్భధారణ సమయంలో శిశువు సాధారణ కదలిక:

ఫస్ట్ ప్రెగ్నెన్సీలో గర్భందాల్చిన 16 నుంచి 25 వారాల (weeks) మధ్య శిశువు మొదటి (first)కదలికను అనుభవించవచ్చు. కానీ 25వ వారం వరకు మీరు ఆ మూమెంట్‌ను గమనించకపోవచ్చు. ఇక రెండో లేదా మూడో గర్భంలో కొంతమంది మహిళలు (women) 13 వారాలలోపే కదలికను అనుభవిస్తారు. అంతకు ముందు కడుపులో శిశువు కదలలేనంత పరిమాణంలో ఉంటుంది. ఒకసారి కడుపులో బిడ్డ కదులుతున్నట్లు మీరు అనుభూతి (feeling) చెందితే.. ఆ కదలికను మీ పార్ట్‌నర్ (partner) అనుభూతి చెందడానికి మరికొన్ని వారాలు పట్టవచ్చు. ఈ సమయానికి కల్లా మీ బిడ్డ కదలిక నమూనాపై ఒక ఆలోచన (Thinking) ఉంటుంది. మీరు అనుభూతి చెందే కదలిక రకం శిశువు పెరుగుదల, అభివృద్ధి (develop) దశపై ఆధారపడి (depend) ఉంటుంది.

శిశువు కదలిక ఎలా అనిపిస్తుంది?

పిల్లలు (children) రోజులోని కొనని నిర్దిష్ట సమయాల్లో ఎక్కువగా కదులుతారని, తల్లులు నిద్రిస్తున్నప్పుడు (sleep) వారు మరింత చురుగ్గా (active) ఉంటారని భావిస్తారు. ఇక వారిచ్చే కిక్స్ (kicks) కడుపులో సీతాకోకచిలుకలు (butterfly) ఉన్నాయనే అనుభూతిని కలిగిస్తాయి. ఎందుకంటే అవి మీ కడుపును అల్లకల్లోలం చేస్తాయి. ఇలా కిక్స్, జాబ్స్, (jobs) మోచేతులు వంటి కొన్ని కదలికలకు క్రమంగా అలవాటుపడతారు. 36-37 వారాల నాటికి శిశువు బరువు (weight) పెరగడం, ద్రవ పరిమాణం తగ్గడంతో పాటు గర్భాశయం లోపల శిశువుకు కదలడానికి తక్కువ స్పేస్ (space) అందుబాటులో ఉండటం వలన వారి కదలికలు మరోసారి క్షీణించడం ప్రారంభమవుతాయని గుర్తుంచుకోవాలి.

శిశువు కదలికలు ఎందుకు ముఖ్యమైనవి?

శిశువు కదలికలను ట్రాక్ (track) చేయడం చాలా (important)ముఖ్యం. ఎందుకంటే మీరు వాటిపై శ్రద్ధ చూపకపోతే కీలక సంకేతాలు, సిగ్నల్స్‌ (signals) కోల్పోవచ్చు. మీ బిడ్డతో చెక్ ఇన్ చేయడానికి మీ కోసం రిమైండర్స్ (reminders) సెట్ చేసుకోవడం సహాయకరంగా ఉంటుంది. ఇక 24వ వారం నాటికి శిశువు కదలికలు కనిపించకపోవడాన్ని అసాధారణంగా గమనించాలి. అటువంటి సందర్భాల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కదలికలు మందగించడం వంటి లక్షణాలు అనారోగ్య శిశువుకు సంకేతం. మీ శిశువు హృదయ స్పందన (heart beating) రేటు, ఇతర అంశాలను తనిఖీ చేసే ఆస్పత్రిని సందర్శించమని డాక్టర్ మీకు సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో మీకు అల్ట్రాసౌండ్ (ultrasound)గా ఉండవచ్చు.

(Shopping malls: షాపింగ్ లో ఎక్కువ డబ్బు వృధా కాకుండా..)

కాబట్టి ఏదైనా ఆందోళన కలిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించేందుకు సంకోచించకూడదు. బిడ్డ కదలికలకు ఉత్తమ న్యాయనిర్ణేత (Best judge) తల్లి మాత్రమే. గట్‌లో ఏదైనా అసౌకర్యం (Inconvenience) ఉందని అనిపిస్తే వెంటనే వైద్య సహాయం (help) తీసుకోవాలి. ఇవేవి చేయకుండా నిర్లక్ష్యం (neglect) వహిస్తే కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదం (danger) భారిన పడొచ్చు.

Exit mobile version