end

Numbers:మీ ఫోన్ నంబర్‌లో ‘5’ ఉందా? మీరు దురదృష్టవంతులే…

ఏదైనా కంపెనీలో (company) ఉద్యోగం (job) చేయాలంటే అందుకు తగ్గ చదువు, శక్తి సామర్థ్యం, అనుభవం ఉండాలి. కానీ పేరు, ఇంటిపేరు, ఫోన్ నంబర్ (Phone Number) లాంటివి అసలు విషయమే కాదు. అయితే లక్కీ నంబర్ (lucky number) పేరుతో అప్లికేషన్స్ (application) తిరస్కరించిన విచిత్రమైన పరిస్థితి చైనాలో (chaina)చోటుచేసుకోగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త (news)ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.

  

(Relationship:ఈ బంధం కేవలం సెక్స్ గురించా?)

చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ (gvangdang) పట్టణం షెన్‌జెన్‌లోని ఒక విద్యా సంస్థ (Educational institution) యజమాని ఉద్యోగానికి అప్లయ్ చేసిన అభ్యర్థులను సిల్లీ రీజన్‌ (Silly reason)తో (రిజెక్ట్ చేశాడు. వారి ఫోన్ నంబర్‌లో ఫిప్త్ డిజిట్‌(Fifth Digit)లో ‘5’ ఉందనే కారణంతో తిరస్కరించి వార్తల్లో నిలిచాడు. నంబర్ ‘5’ను దురదృష్టంగా భావించే బాస్.. తన కంపెనీలో (Company) పనిచేయడానికి నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే వారి ఫోన్ నంబర్లను మార్చుకోవాలని సూచించడం విశేషం. దీంతో ఒక ఎడ్యుకేషన్ కంపెనీ (education) ఇలాంటి అర్థంలేని రిక్రూట్‌మెంట్ (recruitment) పాలసీని ఫాలో కావడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని విమర్శిస్తున్నారు నెటిజన్స్.  ఉద్యోగ జీవితంలోకి ఇప్పుడు మూఢనమ్మకాలు కూడా వచ్చి చేరాయంటూ చర్చిస్తున్నారు.

‘నా ఫోన్ నంబర్‌లో 0 లేదా 5 ఉండకపోతే బాగుంటుందని మా అమ్మ నాకు చెప్పింది. కాబట్టి అందులో ఒక్క 5 కూడా లేకుండా తీసుకున్నా’ అంటూ ఓ వ్యక్తి ఫన్నీగా కామెంట్ (Funny comments) చేస్తే.. మరోవ్యక్తి ‘ఇది 21వ శతాబ్దం, కానీ ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు కలిగిన బాస్‌లు ఉన్నారు. మీరు అదృష్టం గురించి చెప్పే ఫెంగ్- షుయ్ మాస్టర్‌ని ఎందుకు నియమించుకోకూడదు?’ అని సదరు యజమానిని ప్రశ్నించాడు. చివరగా ఆధునిక ప్రపంచంలో ఇలాంటి పద్ధతులకు స్థానం లేదని, వారి ఫోన్ నంబర్లతో అభ్యర్థులను తిరస్కరించడం మూర్ఖత్వమని ట్రోల్ (Troll) చేస్తున్నారు.

(Mental Stress: స్ట్రెస్ తగ్గాలంటే ఇలా చేయండి..)

Exit mobile version