ఐఎస్‌ఐఎస్(ISIS) తీవ్ర వాదులు ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 9 మంది మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాపడ్డారు. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఉత్తర అఫ్గనిస్థాన్‌లో మినీ బస్సుల్లో బాంబులు అమర్చి పేలుళ్లు జరిపారు. బాల్క్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్‌లో మినీ బస్‌లను లక్ష్యంగా చేసుకొని ముష్కరులు పేలుడు జరిపారని తాలిబన్ అధికారులు తెలిపారు. అయితే గత వారం మసీదు, పాఠశాలలో బాంబు పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో 33 మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ ఐఎస్‌ఐఎస్(ISIS) తెలిపింది. షియాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ముష్కరులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
- Advertisment -
ఆఫ్ఘనిస్థాన్‌లో ISIS బాంబు దాడులు
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -