చెన్నై మణలి పుదునగర్ లో లైవ్ రమ్మీలో బంగారం, డబ్బు కోల్పోయిన ఐటీ ఉద్యోగిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భవానీ(29) ఐటీ సంస్థ లో పనిచేస్తుంది. ఆరేళ్ళ క్రితం భవానీ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు తనయులు ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆదివారం రాత్రి స్నానానికి వెళ్ళిన భవానీ వాష్రూమ్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొనివెళ్లి దర్యాప్తు చేపట్టారు. రమ్మీ కి బాగా అలవాటుపడి 3 లక్షల నగదు 20 గ్రాముల బంగారం నష్టపోయింది. ఈ వ్యవహారం పై ముందుగానే భర్త, తల్లితండ్రులు హెచ్చరించిన ఆమె పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ కారణం గా ఆత్మహత్య చేసుకుంది. కేసు దర్యాప్తు లో ఉంది.