end

Mithila Parker:హీరోయిన్లకు ఇది స్వర్ణయుగమే


గ్లామరస్ బ్యూటీ మిథిలా పార్కర్‌(Mithila Parker) తొలి సినిమా ‘ఓరి దేవుడా’తోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ముంబయి(Mumbai)కి చెందిన ఈ ముద్దుగుమ్మ కేవలం నటిగానే కాదు సింగర్, రైగటర్‌గానూ మంచి పేరును సంపాదించుకుంది. అయితే ఇటీవల ఓ ఇంటరాక్షన్‌లో యంగ్ హీరో విశ్వక్‌‌సేన్(Vishwaksen) అటిట్యూడ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.‘‘ఓరి దేవుడా(Ōri dēvuḍā)’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం పొందడం చాలా సంతోషంగా ఉంది. విశ్వక్‌ నన్ను ‘పొట్టి నూడుల్స్‌’ అని పిలిచిన ప్రతిసారి తెగ నవ్వొస్తుంది. టాక్‌ షోలు, టెలివిజన్‌ కార్యక్రమాలు, సోషల్‌ మీడియా(Social Media) ద్వారా అభిమానులను పలకరిస్తూనే ఉంటా. ఒకప్పటితో పోలిస్తే ఈ సమయం హీరోయిన్లకు స్వర్ణయుగమని భావిస్తున్నా. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా రెమ్యునరేషన్‌(Remuneration) డిమాండ్‌ చేయగలిగే స్థాయికి హీరోయిన్లు ఎదిగడాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఈ రోజుల్లో కంటెంట్‌ను బట్టే అభిమానులు ఆదరిస్తున్నారన్న బ్యూటీ.. సోషల్ మీడియా మనుషుల మధ్య ఎలాంటి భేదం లేకుండా అందరినీ ఒకే వేదికపై నిలపుతుందని, తనకు స్టార్‌డమ్(Stardum) తెచ్చిపెట్టిన ఆ ప్లాట్‌ఫామ్‌లు, అభిమానులకు రుణపడి ఉంటానని తెలిపింది.

(Bigg Boss 6: గుండె పగిలేలా ఏడ్చిన గీతూ..)

Exit mobile version