end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంHoroscope:ఈ రోజు శనగలు, తాంబూలాన్ని దానం చేస్తే మంచిది
- Advertisment -

Horoscope:ఈ రోజు శనగలు, తాంబూలాన్ని దానం చేస్తే మంచిది

- Advertisment -
- Advertisment -
  • నేటి రాశిఫలాలు

జనవరి 20వ తేదీ 2023న కెరీర్​పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి నేటీ రాశిఫలాలుగా గమనించగలరు.

మేషరాశి
మేషరాశి వారికి ఈరోజు మధ్యస్థముగా ఉన్నది. గొడవలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికముగా ఉంటుంది. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు. స్త్రీలకు, కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించడం, ఆవునేతితో దీపాన్ని వెలిగించడం శుభఫలితాలను కలిగిస్తాయి.

వృషభరాశి
వృషభరాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల జాగ్రత్తలు వహించాలి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మనస్తాపము, అనారోగ్యం కలిగే సూచనలున్నాయి. ఉద్యోగ, వ్యాపారములయందు కలసి వచ్చును. ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీ శ్రమతో, ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం పొందుతారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకము, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన శుభములు కలుగును.

మిధునరాశి
మిథునరాశివారికి ఈరోజు మధ్యస్థముగా ఉంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఒత్తిడి, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. శారీరక శ్రమ పెరుగును. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ సహస్రనామాన్ని పఠించండి.

కర్కాటకరాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు మధ్యస్థము నుంచి అనుకూల ఫలితాలున్నాయి. ధనలాభము, వస్తు లాభము కలుగును. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. అన్ని విధాలుగా ఈరోజు కలిసి వచ్చును. కుటుంబ విషయాలయందు జాగ్రత్తలు వహించండి. ఆరోగ్య, ఆర్ధిక వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించడం మంచిది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందాలంటే ఆవునేతితో దీపారాధన చేస్తూ లక్ష్మీదేవిని పూజించాలి.

సింహరాశి
సింహరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థముగా ఉంది. ఆరోగ్యపరమైన, కుటుంబ విషయాల పట్ల జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ, వ్యాపారాల పట్ల మధ్యస్థ ఫలితములు అధికముగా ఉన్నాయి. సమస్యలను నేర్పుతో అధిగమిస్తారు. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు. మరింత శుభఫలితాలు పొందడం కోసం లక్ష్మీ అష్టకాన్ని పఠించి ఆవునేతితో దీపారాధన చేయడం మంచిది.

కన్యారాశి
కన్యారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. మనస్పర్థలు ఏర్పడుతాయి. మీరు అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఒత్తిడి తగ్గును. చేసే ప్రతీ పనిలో విజయం పొందుతారు. ప్రయాణములు, దైవదర్శనములు అనుకూలిస్తాయి. స్త్రీ సౌఖ్యం కలుగును. శత్రువులపై విజయము పొందుతారు. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం మంచిది.

తులా రాశి
తులారాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. చేసే ప్రతీ పనిలో చికాకులు, సమస్యలు ఏర్పడుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారం, కుటుంబం పట్ల ఏదోక సమస్య బాధించును. వ్యాపారస్తులకు ఒత్తిడి అధికమగును. విద్యార్థులకు, స్త్రీలకు సమస్యలు అధికముగా ఉండును. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్రనామాన్ని ఆవునేతితో దీపాన్ని వెలిగించి పఠించడం మంచిది.

వృశ్చిక రాశి
వృశ్చికరాశికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధన లాభము, వస్తులాభము కలుగును. చేసే ప్రతీ పనియందు విజయాన్ని పొందుతారు. కుటుంబముతో ఆహ్లాదముగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ.. అనుకున్న పని పూర్తి చేస్తారు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకం పఠించడం మంచిది.

ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మధ్యస్తంగా ఉంది. ఒత్తిడులు అధికముగా ఉంటాయి. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. చేసే పనుల్లో విజయము పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. ఏలినాటి శని ప్రభావం చేత ఆర్ధిక సమస్యలు, పనుల్లో ఆలస్యము ఏర్పడుతుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. ఆరోగ్య, కుటుంబ వ్యవహరాల పట్ల జాగ్రత్త వహించండి. ఖర్చులు అధికమగును. నియంత్రించుకుంటే మంచిది. పనుల్లో ఇబ్బందులు, ఆటంకములు ఏర్పడును. ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం. ఒత్తిడి అధికముగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు ఎక్కువగా ఉంటాయి. శత్రువులతో జాగ్రత్త. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించి.. ఆవునేతితో దీపారాధన చేయండి.

కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్థము నుంచి చెడు ఫలితాలున్నాయి. ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తలు వహించండి. అప్పులు పెరుగును. ఉద్యోగస్తులకు ప్రయత్నములు కలసివచ్చును. వ్యాపారస్తులకు అప్పు దొరుకుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ ముందుకు సాగుతారు. చేసే ప్రతీ పనిలో కొంత ఆటంకములు ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్ర నామాన్ని పారాయణం చేయడం మంచిది.

మీన రాశి
మీన రాశి వారికి ఈరోజు అనుకూలముగా ఉంది. శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్ధిక, వ్యాపార లాభము కలుగును. ఉద్యోగస్తులకు కలసి వస్తుంది. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించండి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కలసి వస్తుంది. కీర్తి, సౌఖ్యము కలుగును. శనగలు, తాంబూలాన్ని దానం ఇస్తే మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆవునేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధించవలన శుభ ఫలితము కలుగును.

(New Zealand:ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నా)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -