end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంబాధితులను ఆదుకోవడం ప్రభుత్వ కర్తవ్యం..
- Advertisment -

బాధితులను ఆదుకోవడం ప్రభుత్వ కర్తవ్యం..

- Advertisment -
- Advertisment -

-టీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్, శ్రీరామ్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా.. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆదేశాల మేరకు శ్రీరామ్ నగర్ లో వరద బాధితులకు రూ.10వేల చొప్పున నష్టపరిహారం అందజేశారు. ఈ సందర్భంగా చాంద్‌ పాషా మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడం, వారిని కాపాడుకోవడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. సీఎం ఆదేశాల మేరకు వారికి నష్ట పరిహారం అందజేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు గాను బాధితులు.. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వం తమను ఆదుకున్నందుకు ఎప్పటికీ రుణపడి ఉంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణ గౌడ్, కార్యదర్శి బలరామ్ యాదవ్, టాక్స్ ఇన్స్పెక్టర్ మహీధర్, వీఆర్వో శ్రీకాంత్, వి.వెంకటేశ్వర్లు, ఏరియా కమిటీ మెంబర్ తిరుపతి, మాధవ్, రఫీ, పలువురు తెరాస నాయకులు, కాలనీవాసులు ఉన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -