end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంరైతులకు, జవాన్లకు సెల్యూట్ చేసే సమయమిది
- Advertisment -

రైతులకు, జవాన్లకు సెల్యూట్ చేసే సమయమిది

- Advertisment -
- Advertisment -
  • రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

ఢిల్లీ : దేశంలోని ప్రతి భారతీయుడు అన్నం పెట్టే రైతన్నకు సెల్యూట్‌ చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. 72వ రిపబ్లిక్‌ డే దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వంటి కష్ట సమయంలోనూ అన్నదాతలు సాగులో వెనకడుగు వేయలేదని, వారి కృషి వల్లే దేశం ఆహారొత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిందని తెలిపారు. దేశానికి రైతులు ఆహార భద్రత అందిస్తుంటే, సైనికులు సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం గస్తీ కాస్తున్నారని అన్నారు. గడ్డకట్టే చలిలోనూ మన సైనికులు కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. కరోనా వైరస్‌ను దేశం ధీటుగా ఎదుర్కొందని, మహమ్మారిని కట్టడి చేసేందుకు మన శాస్త్రవేత్తలు అత్యంత తక్కువ సమయంలోనే టీకాను తయారు చేసి చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి అన్నారు. కరోనాపై పోరాటంలో ముందు వరుసలో నిలిచిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది సేవలు మరువలేనవన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -