end
=
Tuesday, April 15, 2025
సినీమామ‌న `మ‌న‌వూరి పాండవులు` చిత్ర‌మే.. అక్క‌డి `హ‌మ్ పాంచ్‌` !
- Advertisment -

మ‌న `మ‌న‌వూరి పాండవులు` చిత్ర‌మే.. అక్క‌డి `హ‌మ్ పాంచ్‌` !

- Advertisment -
- Advertisment -

మనవూరి పాండవులు హిందీ రీమేక్ (Hindi remake)ఈ హమ్ పాంచ్, తెలుగులో అత్యద్భుతంగా తెరకెక్కించిన దర్శక దిగ్గజం బాపు(Legend Director Bapu) గారు హిందీలో హమ్ పాంచ్ పేరుతో పునఃసృష్టి చేశారు, తెలుగులో అప్పుడప్పుడే నటులుగా పరిచయం అవుతున్న చిరంజీవి, ప్రసాద్ బాబు, భానుచందర్ లాంటి వారికి మనవూరి పాండవులు మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగులో ఎలాగైతే అప్పుడప్పుడే ఎదుగుతున్న నటులతో తీశారో హిందీలో కూడా మిథున్ చక్రవర్తి నసీరుద్దీన్ షా, గుల్షన్ గ్రోవర్ లాంటి నటులతో రీమేక్ చేశారు. గుల్షన్ గ్రోవర్ అంటే ఎవరో తెలుసా ? క్రిమినల్ సినిమాలో ప్లాస్టిక్ చేయి పెట్టుకున్న విలన్, మనీషా కోయిరాలా ను దారుణంగా చంపుతాడు కదా, బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ ను చేరదీసి పెంచే అండర్ వరల్డ్(Under world don) డాన్. ఇక్కడ రావుగోపాలరావు గారు చేసిన పాత్ర అక్కడ అమ్రీష్ పురి చేశారు, ఆయన బేస్ వాయిస్ లో మామూలుగా మాట్లాడుతున్నా ఒక గొప్ప డైలాగ్ ఏదో చెబుతున్నట్టే ఉంటుంది. యూట్యూబ్ లో HD ప్రింట్ ఉంది, ఇప్పుడు కొత్తగా డైరెక్టర్స్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూసి తీరాల్సిన అద్భుతమైన కళాఖండాలు(Cult classics) మనవూరి పాండవులు, హమ్ పాంచ్

బాపు గారి దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పినా ఇంకా మనం మాట్లాడుకోవడానికి చాలా ఉంటుంది, అసలు ఆయన ఫ్రేమ్ కి 70MM స్క్రీన్ కూడా చిన్నదే అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు, ముత్యాల ముగ్గు సినిమాలో సూర్యున్ని చూస్తూ రావుగోపాలరావు చెప్పే డైలాగ్స్ అసలు ఆ ఫ్రేమ్ కూడా మాట్లాడుతున్నట్టుగా గంభీరంగా ఉంటుంది. ఇక్కడ కృష్ణంరాజు గారు చేసిన పాత్ర అక్కడ సంజీవ్ కుమార్ గారు చేశారు. తెలుగులో చూస్తుంటే పూర్తి గ్రామీణ వాతావరణంలో సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది కానీ హిందీలో ఆ ఫీల్ లేదు. పాటలు చాలా బాగుంటాయి, కారణం లక్ష్మీకాంత్ – ప్యారేలాల్ అనే ఇద్దరు సంగీత దిగ్గజాలే, షబానా ఆజ్మీ, సంజీవ్ కుమార్, అమ్రీష్ పురి లాంటి వారి నటన కోసమైనా హమ్ పాంచ్ చూడాల్సిందే. ఈ సినిమా మహాభారతానికి ఆధునిక కథనం. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లోనూ ప్రతి షాట్ లోనూ మోడ్రన్ మహాభారతం చూస్తున్నట్టే ఉంటుంది నిజానికి మొదట ఈ సినిమాను పుట్టణ్ణ కణగాల్ కన్నడలో `పడువారళ్ళి పాండవరు` పేరుతో తీశాడు, విమర్శకుల ప్రశంసలు పొందిన ఆ చిత్రాన్ని బాపు గారు తెలుగుతో పాటు హిందీలో పునఃసృష్టించాడు.

– విశ్వ‌టాకీస్‌
90309 38479

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -