end

జబర్దస్త్ అదిరే అభికి తీవ్ర గాయాలు..

జబర్దస్త్ కమెడియన్, నటుడు అదిరే అభి టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచయం. ఇటు టీవీ షోలతో పాటు అటు సినిమాల్లోనూ నటిస్తున్న అభి.. తాజాగా షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డాడు. అదిరే అభి తెలుగు సినిమాలు మరియు టెలివిజన్‌ షోల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ కేరీర్ లో ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్ కామెడీ షో లో కొనసాగుతున్నారు. అభి టెలివిజన్ ప్రేక్షకులను పలు స్పెషల్ స్కిల్స్ తో ఆకట్టుకున్నాడు. 2022 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నాడు. సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన మొదటి సినిమా‘ఈశ్వర్’లో ఫ్రెండ్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి అభి యాంకర్‌గా, డ్యాన్సర్‌గా, స్టాండ్-అప్ కమెడియన్‌గా మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ లో సూపర్ హిట్ స్కిట్లతోనూ ప్రేక్షకులను అలరిస్తుండగా, మరోవైపు సినిమాల్లోనూ హీరోగా అవకాశాలను దక్కించుకుంటున్నాడు. తాజాగా తను ప్రధాన పాత్రల్లో ఓ చిత్రంతో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతోంది.

ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా తాజాగా యాక్షన్ సీక్వెన్స్ ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఫైటర్ ను ఎదుర్కొనే సమయంలో అదిరే అభి ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో చేతికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా చేతికి పెద్దగాయమే తగిలింది. వెంటనే ఆస్ప్రత్రికి తరలించారు. దాదాపు 15 కుట్లు పడ్డాయని చిత్ర యూనిట్ లోని ఒకరి తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందన్నారు.

Exit mobile version