- తెలంగాణ పీసీసీ నిర్ణయం
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు నుండి తప్పిస్తూ తెలంగాణ పీసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అప్పగించిన బాధ్యతల నుంచి, పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు, ఎంపీ నియోజకవర్గ బాధ్యతల నుండి తప్పించి మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్‌లకు అప్పగిస్తూ పీసీసీ నిర్ణయం తీసుకుంది. ఇదిలావుండగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై మాణికం ఠాగూర్‌తో చర్చించనున్నారు. అయితే ఈ నిర్ణయం పెద్ద దుమారం రేపేట్టుగా ఉంది. ఈ చేదు నిజాన్ని జగ్గారెడ్డి అభిమానులు ఎలా స్వీకరిస్తారో చూడాలి.
ఇవికూడా చదవండి…
- ఉక్రెయిన్ చిన్నారులను కిడ్నాప్ చేసిన రష్యా!
- హీరో జూనియర్ ఎన్టీఆర్ కారు బ్లాక్ స్ర్కీన్ తొలగింపు
- పాలిసెట్-2022పై సమీక్ష