end

అడిషనల్‌ ఎస్పీని బలితీసుకున్న కరోనా వైరస్‌

  • కరోనా వైరస్‌తో జగిత్యాల అడిషన్ ఎస్పీ దక్షిణామూర్తి మృతి

కరోనా మహమ్మారికి జగిత్యాల అడిషన్ ఎస్పీ దక్షిణామూర్తి బుధవారం తెల్లవారుజామున మరణించారు. కరోనా వైరస్‌ సోకి వారం రోజుల క్రితం ఆయన కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు. అయితే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం కన్నుమూశారు. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు శాఖ బృందం చాలా దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నారు.

(తెలంగాణలో ఒకేరోజు 2579 కరోనా కేసులు)

దక్షిణామూర్తి పోలీసులు డ్యూటీలో చాలా నిజాయితీగా ఉంటారని, కచ్చితమైన డ్యూటీ చేస్తారని ఆయన మంచి పేరుంది. ఎన్నో కఠినమైన కేసులను చేధించిన ఘనత దక్షిణామూర్తికి దక్కింది. 1989 బ్యాచ్‌కు చెందిన ఆయన నక్సల్‌ ఆపరేషన్స్‌, యాసిడ్‌ దాడి ఎన్‌కౌంటర్‌లలో ఆయన పాత్ర ఉంది. ఆయన ఎస్సై, సీఐ, డీఎస్పీగా వరంగల్‌ జిల్లాలో పనిచేశారు.

(27 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం)

అనంతరం జగిత్యాల అడిషనల్‌ ఎస్పీగా పనిచేస్తున్నారు. చాలా మంది పోలీసు సిబ్బందికి కరోనా వైరస్‌ సోకగా దక్షిణామూర్తి తమ సిబ్బందిలో మనోఃధైర్యాన్ని నింపారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. కానీ చివరికి ఆయనే కరోనా వల్ల మృతి చెందడం చాలా విషాధకరం. అయితే ఈ ఆగస్టు 31న ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడం అందరి మనస్సులను కలిచివేసంది. మంచి పోలీసుగా, స్ర్టిట్‌ ఆఫీసర్‌గా పేరొందారు.

Exit mobile version