end

జమ్ముకశ్మీర్‌లో వారాంతాల్లో లాక్‌డౌన్‌

శ్రీనగర్‌: జమ్ము జిల్లాలో కొవిడ్‌-19 వ్యాప్తిని నివారించే ప్రయత్నంలోభాగంగా ఈ నెల 24 నుంచి వారాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లా మేజిస్ట్రేట్ సుష్మా చౌహాన్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, అత్యవసర వైద్య అవసరాల కోసం మినహా, అన్ని శుక్రవారాలు సాయంత్రం 6 గంటల నుంచి జమ్ము జిల్లా పరిధిలో వ్యక్తులు, వాహనాలు, అన్ని కార్యకలాపాల కదలికలపై పూర్తి పరిమితి ఉంటుంది. వచ్చే శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుంది.

ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు పాస్ అవసరం లేదని ఉత్తర్వులో పేర్కొన్నారు. “చీఫ్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ ఎపిడెమియాలజిస్టులు, ఇతర ఆరోగ్య నిపుణులతో విస్తృత సంప్రదింపుల అనంతరం వారాంతపు రోజుల్లో కఠినమైన భౌతిక దూర నిబంధనలు, అలాగే వారాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్‌ పాటించాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నట్టు జిల్లా మేజిస్ట్రేట్‌ పేర్కొన్నారు. 

స్థానిక ఫార్మసిస్ట్‌లు, పండ్లు, కూరగాయలు, పాడి దుకాణాలు మాత్రమే సమాజం అవసరాలకు తెరిచి ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌కు వచ్చే లేదా వెళ్లే ప్రయాణికులను నిలిపి ప్రశ్నించినప్పుడు తప్పనిసరిగా టిక్కెట్లు చూపాల్సి ఉంటుంది. చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్ చూపడం ద్వారా విమానాశ్రయం, రైల్వే స్టేషన్ వద్ద మోహరించిన సిబ్బంది ప్రయాణించడానికి అనుమతిస్తారు.

Exit mobile version