end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంగ్రేటర్‌లో పోటీచేయనున్న జనసేన
- Advertisment -

గ్రేటర్‌లో పోటీచేయనున్న జనసేన

- Advertisment -
- Advertisment -

ఇవాళ జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. రేపట్నించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా.. 21న నామినేషన్ల పరిశీలన, 22 నామినేషన్ల విత్‌డ్రా, డిసెంబర్‌ 01న ఎన్నికలు జరగుతాయి. 04న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడవుతాయి. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం పోటీకి సమాయత్తమవుతున్నాయి. వారి వారి వ్యూహాల్లో పార్టీ పెద్దలున్నారు. కాగా, పవన్‌కళ్యాణ్‌ అధినేతగా ఉన్న జనసేన పార్టీ కూడా బల్దియా పోటీ చేయాలని భావిస్తోంది.

పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు పోటీకి సై అంటున్నారనీ.. దీంతో, తాము పుర ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. గ్రేటర్‌లో పార్టీకి మంచి పట్టుందని ఆయన తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ.. బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మరి జీహెచ్‌ఎంసీ బరిలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా.. లేక ఒంటరిగానే రంగంలోకి దిగుతాయా.. అనే విషయం తేలాల్సి ఉంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -