end
=
Friday, November 22, 2024
వార్తలుఅంతర్జాతీయంమూడు నిమిషాల్లో 7 లక్షల చోరీ
- Advertisment -

మూడు నిమిషాల్లో 7 లక్షల చోరీ

- Advertisment -
- Advertisment -

మూడు నిమిషాల్లో దొంగలు రూ.ఏడు లక్షల విలువ గల యెన్‌(జపాన్‌ కరెనస్సీ)లను దొంగిలించారు. ఈ ఘటన జపాన్‌లోని ప్రఖ్యాత ఇగా-ర్యూ మ్యూజియంలో జరిగింది. దొంగలింపబడిన యెన్‌ల బరువు దాదాపు 150 కిలోలోఉంటాయి. ఇవి సుమారు వెయ్యి మంది సందర్శకుల నుంచి వసూలు చేసిన ఫీజు ఉంటుంది. దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి కిందకి వంచేసి కనపడకుండా చేశారు.

అయితే మ్యూజియంలోని అలారం దొంగతనం చేసే సమయంలో మోగలేదు. దొంగతనం జరిగిన చాలా సేపటికి మోగింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చే సరికి దొంగలు డబ్బులతో ఉడాయించారు. అయితే ప్రాచీన జపనీస్‌ చరిత్రలో నింజాస్‌ భూస్వామ్య వర్గానికి చెందిన యోధులు. వారు వేగంగా దొంగతనం చేసేవారు. ఉన్నత తరగతికి చెందిన సమురాయ్‌లకు వీరు సేవ చేసేవారు. కాగా, ప్రస్తుతం జరిగిన దొంగతనం కూడా వారి స్టైల్లో ఉండడంతో ఇది చర్చనీయాంశమైంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -