end

రైతుబిడ్డే జపాన్ ప్రధాని

సుగాను లాంఛనంగా ఎన్నుకున్న ఆ దేశ పార్లమెంటు

వెబ్‌డెస్కు :  జపాన్‌ ప్రధానిగా యోషిహిదే సుగా (71)ను ఆ దేశ పార్లమెంటు ఎన్నుకొంది. తొలుత ఆయన అధికార పక్షమైన లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. ఇంత వరకు ప్రధానిగా వ్యవహరించిన షింజో అబేకు కుడిభుజంగా, నీడగా వ్యవహరించారు. ఆయన మంత్రివర్గంలో చీఫ్‌ కేబినెట్‌ కార్యదర్శిగా, కార్యక్రమాల సమన్వయకర్తగా వ్యవహరించి తెరవెనుక పరిపాలనను కొనసాగించారు. కార్యక్రమాల అమలులో అధికార యంత్రాంగంతో కఠినంగా వ్యవహరిస్తారన్న పేరుంది. తన విధానాలను వ్యతిరేకించిన అధికారులను దూరప్రాంతాలకు బదిలీ చేయడమో, ఆ విధుల నుంచి తొలగించడమో వంటి చర్యలు తీసుకునే వారు. అందుకే ఆయనను ‘షాడో ప్రైమ్‌ మినిస్టర్‌’ అని అభివర్ణించేవారు. అబే విధానాలను కొనసాగిస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కరోనాను అరికట్టడం, ఈ మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే తన ప్రథమ ప్రాధాన్యతలని తెలిపారు.

అల్‌ఖైదా ఉగ్ర కుట్ర భగ్నం

స్వయం కృషితో ఎదిగిన రైతు బిడ్డ

సుగా స్వయం కృషితోనే ఉన్నత పదవిని అధిరోహించారు. తల్లిదండ్రులు స్ట్రాబెర్రీలు సాగుచేసే రైతులు. వారెవరికీ రాజకీయాలతో సంబంధం లేదు. ఉన్నతవిద్యాభ్యాసం చేసిన వారూ లేరు. ఆయన టోక్యో విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. రుసుముల చెల్లింపు కోసం చిన్నాచితకా ఉద్యోగాలు చేశారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక కట్టుబడి ఉండేవారని, ఇప్పటికీ దానినే కొనసాగిస్తున్నారని చిన్ననాటి స్నేహితులు గుర్తుచేసుకున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం చాలా క్రమశిక్షణతో ఉంటుంది. సూటు వేసుకొనే చిన్నపాటి వ్యాయామాలు చేస్తారు. అత్యవసరమైతే వెంటనే విదుల్లోకి వెళ్లడానికే ఆయన ఇలా చేస్తుంటారు. మిఠాయి పదార్థాలు అంటే మహా ఇష్టం. ప్రజలు స్వశక్తితోను, పరస్పర సహకారంతోనూ ఎదగాలన్నదే ఆయన విధానం. పరిపాలనలో ఇది కనిపిస్తుంది కూడా.

సిటీ బస్సులు నడపనున్న APSRTC

రక్షణ మంత్రిగా అబే తమ్ముడు

సూగా 20 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. చాలా మంది మంత్రులకు మళ్లీ అవకాశం లభించింది. రక్షణ మంత్రిగా మాజీ ప్రధాని షింజో అబే తమ్ముడు నొబువో కిషిని కొత్తగా నియమించారు. కిషి చిన్నతనంలోనే మేనమామకు దత్తత వెళ్లారు. విదేశీ వ్యవహారాల మంత్రి తోషిమిత్సు మొటేగీ, ఆర్థిక మంత్రి, ఉపప్రధాని తారో అసో అదే పదవుల్లో కొనసాగనున్నారు. ఒలింపిక్స్‌ మంత్రిగా షైకో హషిమోటోనే ఉంటారు. ఏడు ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొన్న ఆమె 1992లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. 1964లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌ సమయంలో ఆమె జన్మించడంతో ఒలింపిక్‌ జ్యోతి అని అర్థం వచ్చేలా ఆమెకు షైకో హషిమోటో అని తల్లిదండ్రులు పేరు పెట్టారు.

మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు

అబే రాజీనామా

సుగా అధికార బాధ్యతలు చేపట్టడానికి వీలుగా అబేతో పాటు మంత్రివర్గమంతా లాంచనంగా రాజీనామా చేసింది. అనారోగ్య కారణాలతో అబే ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీర్ఘకాలంపాటు ఈ పదవిలో ఉన్న నేత ఆయనే కావడం గమనార్హం.

Exit mobile version