end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంజవాను ఆదర్శ వివాహం..
- Advertisment -

జవాను ఆదర్శ వివాహం..

- Advertisment -
- Advertisment -
  • ప్రశంసలు కురిపిస్తున్న దేశ ప్రజలు

లక్నో: రక్షణశాఖలో పనిచేస్తున్న జవాను ఒక్క రూపాయి, ఒక కొబ్బరి బోండంను కట్నంగా తీసుకుని పెళ్లి చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. మూడేళ్ల పాటు కార్గిల్‌లో విధులు నిర్వహించిన వివేక్ ప్రస్తుతం లక్నోలో డ్యూటీ చేస్తున్నారు. వరకట్న వ్యవస్థను రూపుమాపాలనే సందేశమిస్తూ సైనికుడు వివేక్ చేసుకున్న వివాహం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే గంగోహ్ పరిధిలోని జుఖెడి గ్రామ నివాసి సంజయ్ కుమార్ కుమారుడు వివేక్ కుమార్‌కు బీన్డాకు చెందిన అరవింద్ కుమార్ కుమార్తె ప్రియతో నవంబరు 30న వివాహం జరిగింది.

ఈ సందర్భంగా వధువు తల్లిదండ్రులు కట్నకానుకల రూపంలో లక్షల రూపాయలు ఇవ్వాలనుకున్నారు. అయితే వరుడువివేక్ తనకు ఎటువంటి కట్న కానుకలు వద్దని కేవలం ఒక్క రూపాయి, కొబ్బరిబోండం చాలని, వాటినే స్వీకరించారు. వధువే తనకు అందమైన కట్నమని తెలిపారు. వధువు ప్రియ కూడా తనకు కాబోయే భర్త ఆదర్శభావాలకు మురిసిపోయింది. కాగా వివేక్, ప్రియలకు ఏడాది క్రితమే నిశ్చితార్థం జరిగినా, వివేక్ ఉద్యోగ బాధ్యతల కారణంగా పెళ్లి వాయిదా పడింది. వివేక్‌ను ఇటీవలే లక్నోకు బదిలీ చేశారు. దీంతో వీరి పెళ్లికి ఆటంకాలు తొలగిపోయినట్లయ్యింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -