end

Jayasudha :మూడో పెళ్లికి సిద్ధమైన జయసుధ?

  • అమెరికన్ వాసితో పెళ్లిపై క్లారిటీ

తెలుగు సీనియర్ నటి జయసుధ (Jayasudha) మూడో పెళ్లి ఇష్యూ (issue) హాట్ టాపిక్‌గా (hot topic)మారింది. ప్రస్తుతం 64 ఏళ్ల వయసున్న ఆమె మరోసారి పెళ్లిపీఠలెక్కబోతుందనే వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. అంతేకాదు వరుడు కూడా అమెరికాకు (AMERICA) చెందిన వ్యక్తిగా, ఇటీవల అతనితో వివిధ కార్యక్రమాలకు హాజరవుతోందని, పలు పార్టీల్లోనూ క్లోజ్ గా కనిపంచినట్లు జోరు ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా స్పందించిన ఆమె ఈ పుకార్లను కొట్టిపారేసింది.

ఈ మేరకు రీసెంట్‌గా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘నాతోపాటుగా కొన్ని రోజుల నుంచి ప్రయాణిస్తున్న వ్యక్తి పేరు ఫిలిప్ రూల్స్ (Philip rules). అతడు అమెరికన్ (American). నా బయోపిక్(Biopic) చేయడానికి భారతదేశానికి వచ్చాడు. సినీరంగంలో నా ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలని ప్రతి కార్యక్రమానికి నాతో వస్తున్నాడు. అని అసలు విషయం చెప్పింది జయసుధ. ఇంటర్‌నెట్‌లో (Internet)ఫిలిప్ నా గురించి తెలుసుకున్నారు. నిజ జీవితంలో నేను ఎలా ఉంటాను అని నాకు తెలుసు. నా సినిమాలు(cinema), షూటింగ్‌ల (shooting)వివరాలను తెలుసుకునేందుకు నాతో ఉన్నారు. అది వదిలేస్తే వేరే ఏమీ లేదు.’ అని జయసుధ క్లారిటీ(clarity) ఇచ్చారు.

ఎన్టీఆర్‌(NTR), ఎఎన్‌ఆర్‌ లాంటి హీరోలతోపాటుగా.. తర్వాతి తరం హీరోలతోనూ జయసుధ నటించారు. త‌ర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా (character artist) మారిపోయారు. త‌ల్లి, వ‌దిన‌, అమ్మమ్మ, నానమ్మలాంటి పాత్రల్లోనూ కనిపిస్తుంటారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా.. ఈజీగా చేసేస్తారు. కాక‌ర్లపూడి రాజేంద్ర ప్రసాద్(rajendra prasad) అనే వ్యక్తిని మెుదట వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత మనస్పర్థలతో విడిపోయారు. ఆ త‌ర్వాత బాలీవుడ్‌ (Bollywood) జితేంద్ర(jithendra) క‌పూర్ కజిన్(cousin) నితిన్ క‌పూర్‌(nithin kapoor) ను వివాహం చేసుకున్నారు. నితిన్ క‌పూర్ 2017లో చనిపోయారు. తాజాగా దళపతి విజయ్ నటించిన వారసుడు(Varasudu) సినిమాలో తల్లి పాత్రలో నటించింది.

(Kodi pandaalu:పోలీసులు అడ్డు చెప్పినా ఆగని కోడి పందాలు)

Exit mobile version