end
=
Wednesday, November 20, 2024
వార్తలురాష్ట్రీయంఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి
- Advertisment -

ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి

- Advertisment -
- Advertisment -

తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్‌లోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో గురువారం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి 192వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పాఠశాల ప్రిన్సిపాల్ వినీత్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లక్ష్మీబాయి దేశానికి సేవను ఎప్పటికీ మరవలేమన్నారు. ఆమె సేవలకు గుర్తుగా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టాలి. భారత వీరనారిగా పేరుగాంచిన లక్ష్మీబాయి.. తన కుమారుడిని ఒడిలో కట్టుకొని శత్రువులపై కత్తి దూషించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎఫ్‌ మెదక్ జిల్లా అధ్యక్షుడు భీమరి సాయి సమ్మర్, అజర్ అలీ, శ్రీకర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ వినీత్ కుమార్, సరూప్, బలరాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -