టెలికాం సంస్థలు ఇటీవల టారిఫ్ రేట్లు పెంచుతూ యూజర్లకు షాక్ ఇచ్చాయి. మొదటగా ఎయిర్‌టెల్, వోడాఫోన్ టారిఫ్ రేట్లు పెంచగా అదేబాటలో రిలయన్స్ జియో కూడా టారిఫ్ ప్లాన్ ధరలను పెంచింది. అయితే వినియోగదారుల నుండి తీవ్ర విమర్శలు రావడంతో జియో కొంత ఉపశమనం కలిగిస్తూ 20 శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించింది. జియో మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్‌పై 20 శాతం జియోమార్ట్ క్యాష్‌బ్యాక్‌ను అందజేస్తోంది. రూ.719, రూ.666, రూ.299 ప్లాన్‌లతో రీచార్జ్ చేసుకుంటే సుమారు రూ.200 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అయితే ఈ క్యాష్‌బ్యాక్ రీచార్జ్ చేసుకున్న మూడు రోజుల లోపు వ్యాలెట్‌లోకి వస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ కూపన్ అన్ని రిలయన్స్ రిటైల్ స్టోర్‌లు, జియోమార్ట్, ఎజియో, ట్రెండ్స్ ఆన్‌లైన్‌లో కూడా రిడీమ్ చేసుకోవచ్చు.