కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2021 సంవత్సరానికి గాను అప్రెంటీస్ ఉద్యోగాల నియామకానికి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 6100 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే అక్టోబర్ 31 నాటికి 20 నుండి 28 సంవత్సరాల గరిష్ట వయసు ఉన్నవారు అర్హులు. దీంతోపాటు రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితి సడలింపులు ఉంటాయి. అభ్యర్థులు https://www.sbi.co.in/ ఆన్‌లైన్‌లో ద్వారా అప్లై చేసుకోవాలి.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ విభాగంలో 125 ఖాళీలున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 100 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈరోజు (జూలై 6)నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 26 చివరితేదీ.
ఎంపిక ప్రక్రియ..
స్థానిక భాషకు సంబంధించిన పరీక్ష కూడా ఉంటుంది. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఇందులో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి.నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక తప్పు సమాధానానికి 1/4 మార్కు తొలగిస్తారు. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ ఆగస్టు 2021లో ఉంటుంది.
NALSAR యూనివర్సిటీలో ఎంబీఎ ప్రవేశాలు
దరఖాస్తు ఫీజు..
జనరల్, ఓబీసీ రూ. 300 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.