- ఈ అనుభూతి మాటల్లో వర్ణించలేనన్న కాజోల్
30 ఏళ్ల తర్వాత తన స్నేహితుడు కమల్ సదానా(Kamal Sadanah)ను కలిసిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంటోంది కాజోల్. 1992 సంవత్సరంలో వచ్చిన ‘బెఖుడి(Bekhudi)’లో కలిసి నటించిన వీరిద్దరూ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘సలాం వెంకీ(salam Venki)’లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి ప్రశాంతంగా ఉండలేకపోతున్నట్లు తెలిపిన కాజోల్ తాజాగా విడుదల చేసిన ‘సలాం వెంకీ’ ట్రైలర్ ఈవెంట్‌లో తెగ హంగామా చేసింది.
అయితే షూటింగ్ మొదలయ్యేంతవరకూ దర్శకనిర్మాతలు(Director) తనకు ఈ విషయం చెప్పలేదన్న ఆమె.. ‘ఓ మై గాడ్.. ఎవరూ నాకు చెప్పలేదు. నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇది నిజంగా అద్భుతం’ అని ఆశ్చర్యపోయినట్లు తెలిపింది. అలాగే ‘మొదటి ఐదు నుండి పది నిమిషాలు నేను ఏమీ మాట్లాడలేదు. అరుస్తూనే ఉన్నా. నిజంగా ఈ అనుభూతి బాగుంది. మేము ఈ మధ్య కలుసుకుంటూనే ఉన్నాం. ఒకరి బాగోగుల తెలుసుకుంటున్నాం. కానీ మళ్లీ అతనితో కలిసి పనిచేయడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది’ అంటూ వివరించింది. ఇక దీనిపై స్పందించిన దర్శకురాలు రేవతి(Revathi).. ‘సినిమాలో కమల్ నటిస్తున్న విషయాన్ని నేను కాజోల్‌కి చెప్పలేదు. వీరిద్దరి మధ్య చాలా ముఖ్యమైన సన్నివేశం ఉంది. ఇది ఆమెకు పెద్ద ఆశ్చర్యం(Surprice) కలిగించింది’ అని చెప్పింది. చివరగా ‘కాజోల్‌తో మళ్ళీ షూటింగ్ చేయడం వల్ల నేను ‘బెఖుడి’ సెట్స్‌లో ఉన్నట్లే ఫీల్ అయ్యాను. ఆమె ఇప్పటికీ నాన్‌స్టాప్‌గానే మాట్లాడుతుంది. అందుకే నేను నా కుర్చీని ఎత్తుకుని మరొక వైపుకు వెళ్లాల్సి వచ్చింది’ అంటూ ఫన్నీగా సదానా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైలర్ అవుతుండగా డిసెంబర్ 9న ఈ మూవీ రిలీజ్ అవుతుంది.