end
=
Sunday, January 19, 2025
వార్తలుఅంతర్జాతీయంఅమెరికా గ్రీన్‌ కార్డుకు బైడన్‌ ఓకే
- Advertisment -

అమెరికా గ్రీన్‌ కార్డుకు బైడన్‌ ఓకే

- Advertisment -
- Advertisment -
  • ఇమ్మిగ్రేషన్‌ విధానాలలో సవరణలు

కలల సౌధం అమెరికాలో అడుగుపెట్టడానికి ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. అమెరికా గ్రీన్‌కార్డు కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకొని అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇదివరకు ట్రంప్‌ ప్రభుత్వం అమెరికావాసుల ఉద్యోగ, జీవిత భద్రత దృష్ట్యా ఇతర దేశాలవారికి గ్రీన్‌కార్డు నిషేధించింది. దీనివల్ల అమెరికాలోని చాలా వ్యాపార సంస్థలు నష్టపోయాయని అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడన్‌ అన్నారు. అంతేగాకుండా డోనాల్డ్ ట్రంప్‌ నిషేధించిన గ్రీన్‌కార్డులకు అనుమతిలిస్తూ వలసదారులను ప్రోత్సహిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన ఇతర దేశస్థులకు మంచి జరగనుంది. ట్రంప్‌ తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్‌ విధానాలను సవరిస్తూ ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని బైడన్‌ స్పష్టం చేశారు. దీంతో ముఖ్యంగా భారతదేశ వాసులు అమెరికా ఐటీ కంపెనీలలో, ఇతర వ్యాపార సంస్థలలో పనిచేసేందుకు మార్గం సులభమైంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -