end
=
Friday, September 20, 2024
వార్తలుజాతీయందేశవ్యాప్త పర్యటకు సిద్దమైన జేపీ..
- Advertisment -

దేశవ్యాప్త పర్యటకు సిద్దమైన జేపీ..

- Advertisment -
- Advertisment -

ఇటీవల జరిగిన బిహార్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ(దుబ్బాక స్థానం) శాసనసభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అద్వితీయ విజయాలు సాధించిన విషయం తెలిసిందే. బిహార్‌లో జేడీయూతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. అక్కడ అత్యధిక సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ విజయాలతో ఆపార్టీ ఏమి పొంగిపోవడంలో లేదు. భవిష్యత్‌ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతానకి వ్యూహాలు రచిస్తోంది. దేశవ్యాప్తంగా విజయాల పరంపర కొనసాగుతున్నా.. ‘దీర్ఘ దృష్టి’ తో మరిన్ని వ్యూహాలను రచిస్తోంది.

2024 సార్వత్రిక ఎన్నికలకనుగుణంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశవ్యాప్తంగా ఓ యాత్రను చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ‘రాష్ట్రీయ విస్తృత్ ప్రవాస్’ అన్న పేరుతో 100 రోజుల పాటు ఈ యాత్రను చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఏయే రాష్ట్రంలో ఎన్ని రోజులు పర్యటించాలన్నది కూడా సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాభవం పొందిన రాష్ట్రాలు, నియోజకవర్గాలపై ఈ యాత్ర ద్వారా ఎక్కువ ఫోకస్పె ట్టారు. అక్కడి క్షేత్ర స్థాయి అంచనాలను ఆకళింపు చేసుకోనున్నారు. ఇక… ఈ యాత్రలో భాగంగా నడ్డా.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న శాసన సభ్యులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, తదితరులతో సమావేశమవుతారు.

పార్టీ పటిష్ఠత, విస్తరణ, పొత్తులు, మరిన్ని సీట్లు ఎలా సాధించొచ్చు, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తులు.. ఇలా పలు విషయాలను ఈ యాత్రలో క్షుణ్ణంగా చర్చించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ రాష్ట్ర శాఖలు పార్టీ విస్తరణకు చేస్తున్న కార్యక్రమాలు, చేసిన కార్యక్రమాలను నడ్డా ముందు ఉంచనున్నారు. వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని, ఇకపై పార్టీ విస్తరణ ఎలా చేయాలన్న దానిపై ఆయన శ్రేణులకు మార్గనిర్దేశనం చేయనున్నారని పార్టీ నేతలు అంటున్నారు.

అయితే దేశవ్యాప్తంగా కోవిడ్ ప్రభావం ఉంది కాబట్టి… యాత్ర సందర్భంగా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. నడ్డా సమావేశమయ్యే హాలులో 200 మంది కంటే ఎక్కువగా ఉండకుండా స్థానిక పార్టీలు బాధ్యత వహించనున్నాయి. ‘‘నడ్డా సమావేశమయ్యే గదుల దగ్గర టెంపరేచర్‌ను పరీక్షించే పరికరాలు, శానిటైజర్లు, మాస్కులు ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శాలువాలు, బోకేలు ఇచ్చేసాంప్రదయానికి ప్రస్తుతానికి స్వస్తి పలికాం. ప్రతి అంశంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని పార్టీ నేతలు తెలిపారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా యాత్రను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్ఠానం రాష్ట్రాలను ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా విభజించింది. గ్రూపు ‘ఏ’ లో బీజేపీ పాలిత రాష్ట్రాలు, లేదా సంకీర్ణ ధర్మంతో అధికారంలో ఉన్న రాష్ట్రాలు. ఇక ‘బీ’ గ్రూపులో అధికారంలో లేని రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్… తదితర రాష్ట్రాలు, ‘సీ’ గ్రూపులో చిన్న రాష్ట్రాలు లక్షద్వీప్, మేఘాలయ, మిజోరాం.. చివరగా ‘డీ’ గ్రూపు. ఇందులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు కేరళ, బెంగాల్, అసోం, పాండిచేరి, తమిళనాడు.. ఇలా గ్రూపులుగా విభజించుకొని మరీ… పకడ్బందీ ప్రణాళికను రూపొందించింది బీజేపీ. అయితే ‘సీ’ కేటగిరీ కింద వచ్చే రాష్ట్రాల్లో మాత్రం నడ్డా రెండు రోజుల పాటు బస చేయనున్నట్లు పార్టీ సమాచారం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -