end
=
Friday, November 22, 2024
వార్తలుజాతీయంతీర్పు ఎవరివైపు..!
- Advertisment -

తీర్పు ఎవరివైపు..!

- Advertisment -
- Advertisment -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం వర్సెస్ ప్రభుత్వంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ నేపథ్యంలో స్థానిక ఎన్నికలను నిలిపేయాలని కోరుతూ సుప్రీం కోర్టును జగన్ సర్కార్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే షెడ్యూల్‌ రిలీజ్‌ అయినప్పుడు హైకోర్టు ప్రభుత్వం వేసిన పిటిషన్‌నే పరిగణలోకి తీసుకుంది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు నిలిపేయడమే ఉత్తమమని వాదించింది. దీంతో ప్రభుత్వం ఫుల్‌ ఖుషీ అయింది. దీంతో, చిర్రెత్తుకొచ్చిన ఎన్నికల కమిషనర్‌ సుప్రీంను ఆశ్రయించారు. అలాగే ప్రభుత్వం సైతం సుప్రీంలో పిటిషన్‌ వేసింది.

ఇదే తరుణంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆదివారం షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 21, 28 తేదీలలో.. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఇదిలా ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదలను కోరుతూ ఏపీ సర్కార్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. దీంతో రేపు ఏం జరగబోతుందోననే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓ రాష్ట్రంలో ఎన్నికలకు అనుమతిచ్చి, మరో రాష్ట్రంలో నిలిపేస్తే న్యాయస్థానం చిక్కుల్లో పడుతుందంటున్నారు న్యాయ నిపుణులు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -