ఏ వ్యక్తి అయినా మళ్లీ మళ్లీ కోపగించుకుంటున్నారంటే.. వారికి మానసికంగా సమస్యలున్నాయని(Metal Problems) అర్థం. మానవ శరీర నిర్మాణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే వేళకు నిద్రపోవడం ఎంతో అవసరం. ఎంత డబ్బున్నా నిద్ర కరువయితే జీవితం వ్యర్థం అనే విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిద్ర కరువై, చాలా మంది సతమవుతున్నారు. కాగా ప్రతి ఒక్కరికీ కనీసం 7 నుంచి 9 గంటల సంతృప్తికరమైన నిద్ర(Sleep) అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్ర పోగలితే రోగనిరోధక శక్తి(Immunity) పెరిగి, మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటామని డాక్టర్లు సూచిస్తున్నారు.
(Dark Chocolate:డార్క్ చాక్లెట్‌తో మతిమరుపు దూరం)
నిద్రలేమితో విపరీతమైన కోపం, ఓపిక లేకపోవడం, భావోద్వేగ నియంత్రణ కోల్పోవడం(Loss of emotional control) తదితర చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. నిద్ర సరిగ్గా లేకపోతే మెదడులో కీలకంగా ఉన్న ‘అమిగ్‌డాలా’ అనే రసాయనం పనితనం మందగిస్తుందని ఇటీవలే జర్నల్ ఆఫ్ రీసెర్చ్(Journal of Research) తెలిపింది. కోపానికి, నిద్రకు సంబంధం ఉన్నట్లు ఆధారాలతో నిరూపించింది. నిద్ర సమస్యలను అధిగమించాలంటే పౌష్టికాహారం, వ్యాయాయం, మానసిక ప్రశాంతత మూడు కచ్చితంగా పాటించాలని డాక్టర్లు జాగ్రత్తలు చెబుతున్నారు. పడుకునే ముందు సెల్‌ఫోన్(Mobile)కు ఎంత దూరముంటే అంత మంచిదని డాక్టర్ల సూచన.