end

హనీమూన్‌కు రెడీ అంటున్న కాజల్‌..

ప్రముఖ నటి, టాలీవుడ్ చందమామ కాజల్‌ గత నెల 30న తన ప్రేమికుడు, పారిశ్రామిక వేత్త గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబయిలోని ఓ హోటల్‌లో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వివాహం తర్వాత ఇటీవల మొదటి కార్వా చౌత్‌ని జరుపుకున్న కాజల్.. తమ సాంప్రదాయం ప్రకారం భర్త కోసం ఉపవాసం కూడా చేసింది.

అతి త్వరలోనే ఈ నూతన జంట హనీమూన్‌‌కు కూడా బయల్దేరుతోంది. ఆ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హింట్ ఇచ్చింది కాజల్‌ బేబీ. బ్యాగ్‌లు, పాస్ట్‌పోర్ట్‌లు ఉన్న ఫొటోలను పోస్ట్ చేసి, బ్యాగులు సర్దేసుకున్నాం, రెడీ టు గో అంటూ విమానం ఎమోజీలు ఉన్న పొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత చిరు కథానాయకుడిగా నటిస్తున్నఆచార్య సినిమా షూటింగ్‌కు కాజల్ హాజరుకాబోతోంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు.

Exit mobile version