end

Varalakshmi Vrata:వరలక్ష్మీ వ్రతానికి కలశం తయారీ

పండగలు(Festivals) ప్రతి ఒక్కరికి ముఖ్యమైనవి. ఏదైనా పండగ వచ్చిందంటే చాలు చాలా హుషారుగా పనులు ప్రారంభించి పూజలకు అందంగా ఆనందంగా సిద్ధం అవుతారు. మహిళల కి వరలక్ష్మి పూజ(Varalakshmi Puja) చాలా ప్రత్యేకం. కొంతమంది మతం తో సంబంధం లేకుండా ఏ రకమైన పండగనైనా జరుపుకొని ఆనందంగా ఉండడానికి చాలా మంది ఇష్ట పడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి పండుగలలో ముఖ్యంగా మహిళలు ఎక్కువగా జరుపుకునే పండగ వరలక్ష్మీ వ్రతం. ప్రస్తుతం కలశాలను బయట మార్కెట్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా కొనుకోవచ్చు.

కలశాలను అనేది జగ్గులా ఉంటుంది. అయితే మీ దగ్గర ఒకవేళ కలశం లేకపోతే కూజాని అయినా ఎంపిక చేసుకో వచ్చు. కలశంని తీసుకున్న తర్వాత దానిలో నీరు లేక ఇతర పదార్థాలను చేర్చండి. సహజంగా అయితే చాలా మంది కలశంలో తమలపాకులు పోక చెక్కలు డబ్బులు ఖర్జూరం మరియు ఇతర డ్రై ఫ్రూట్స్‌(Dry Fruits)ను ఉపయోగిస్తారు. అయితే మీరు ఇందులో గాజులు నగలు వంటి మహిళలకు సంబంధించిన వస్తువులు కూడా ఉపయోగించవచ్చు అంటే ఈ వస్తువులు లక్ష్మీ(Laxmi Devi) దేవిని సూచిస్తున్నట్లు భావిస్తారు.ఈ విధంగా కలశంని సిద్ధం చేసిన తర్వాత కలశ పై భాగంలో మామిడి ఆకులను పెట్టండి. పూర్తిగా కప్పకుండా చూసుకోండి. మామిడి ఆకులు చివరలు బయటకు ఉండేటట్టు చూసుకోవాలి. మామిడి ఆకులు అనేవి నెగిటివ్ ఎనర్జీ(Negative Energy) రాకుండా చేస్తాయి.మీ కలశంని రెడీ చేసుకోవచ్చు.

Exit mobile version