end

Mahbubabad District:ఖమ్మం సభా చారిత్రతామక సభ

తొర్రూర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపు కార్యాలయంలో బిఅర్ఎస్ ఆవిర్భావ సన్నాహక సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, వరంగల్ మేయర్ సుధారాణి ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. హరీశ్ రావు(Minister Harish rao) మాట్లాడుతూ కరీంనగర్ సింహగర్జన తెలంగాణ రాష్ట్ర ఏర్పడి చరిత్రాత్మక సభగా మిగిలిపోయింది.అదేవిధంగా దేశ రాజకీయాలను మలుపు తిప్పబోయే సభ ఖమ్మం(Khammam)లో జరగబోయే బిఆర్‌ఎస్ తొలి సభ.దేశం మొత్తం తెలంగాణ పథకాలను తెలంగాణ అభివృద్ధిని(Development of Telangana) మెచ్చుకునే స్థాయికి తీసుకొచ్చారు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే విధంగా అభివృద్ధి జరుగుతుంది.ఢిల్లీ, కేరళ, పంజాబ్ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ సభ జరగబోతోంది. ఉత్తరప్రదేశ్(Uttarapradesh) మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా గారు ఈ సభకు విచ్చేస్తున్నారు.

ఖమ్మం సభ చారిత్రాత్మక సభ, ఇలాంటి సభలో పాల్గొనే అవకాశం మనందరికీ అక్కడ అదృష్టంగా భావించాలి.కెసిఆర్(CM KCR) ఎదుగుదల నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఎదుగుదల.మహబూబాబాద్(Mahbubabad) జిల్లా నుంచి లక్ష మందితో సభకు విచ్చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.గతంలో మహబూబాబాద్ జిల్లా నీళ్లు నీళ్లు అనే కలవరించేది ఇప్పుడు నీళ్లు చాలు అనే దాకా వచ్చిందంట, ఇది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)తోనే సాధ్యమైంది.మధ్యప్రదేశ్‌లో ఎరువుల కోసం జరిగిన తొక్కిసలాటలు ఏడుగురు రైతుల చచ్చిపోయిన ఘటన డబుల్ ఇంజన్ బిజెపి ప్రభుత్వ పాలనలోనే జరిగింది.తెలంగాణలో రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం.రైతు శ్రేయోభిలాషి కేసీఆర్ ప్రభుత్వం. రైతుబంధు కింద 65 వేల కోట్లు డైరెక్ట్‌గా రైతుల ఎకౌంట్లో వేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభత్వం.కేంద్రంలో అధికారుల బిజెపి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని పెట్టుబడి రెట్టింపు చేసి రైతులకు తీరని నష్టం చేసింది బిజెపి ప్రభుత్వం.

వడ్లు కొనుమంటే చేతులెత్తేశారు, నూకలు బుక్కు మని పరిహాసమాడారు బిజెపి మంత్రి.రైతులకు కల్లాలు కట్టినందుకు పంచాయతీరాజ్ కింద తెలంగాణకి రావాల్సిన 1200 కోట్లు కేంద్ర బిజెపి ఆపింది.ఇదే బిజెపి తీర ప్రాంతాల రాష్ట్రాలకు చేపలు ఎండ పెట్టుకునేందుకు కల్లాలు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చింది.కెసిఆరే లేకపోతే ఎస్సారెస్పీ కాలువలో నీళ్లు పారుతుండేనా?మహబూబాబాద్ రైతులు రైతు బాంధవుడు నిర్వహిస్తున్న బి ఆర్ ఎస్ సభను విజయవంతం చేయాలి.ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాకు రావలసిన గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Minister Kishan Reddy) సమాధానం చెప్పాలి .సైనిక్ స్కూల్ ఎందుకు ఇస్తలేరో చెప్పండి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఎప్పుడు ఇస్తారో చెప్పండి. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పండి.సభను విజయవంతం చేసేందుకు ప్రజలతో పార్టీ నాయకులు ప్రయాణించి వెళ్లాలి. వారిని తిరిగి గ్రామాల్లో వదిలిపెట్టే వరకు నాయకుడు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాం.మంత్రి దయాకర్ రావు గారు అడిగినట్లు తొర్రూరు 30 పడకల హాస్పిటల్‌ను 100 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేసేందుకు వెంటనే అనుమతులు మంజూరు చేస్తాం.

(Vande Bharat:సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య వందే భారత్ ట్రైన్)

Exit mobile version