హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) నివాసముంటున్న ఇంటికి ఏప్రిల్ నెలలో రూ. లక్ష కరెంటు బిల్లు(Current bill) రావడం గమనార్హం. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మనాలీలో ఉన్న మా ఇంటికి ఈ నెల రూ. లక్ష కరెంట్ బిల్లు వచ్చింది. ఈ మధ్యకాలంలో నేను ఆ ఇంట్లో(House) ఉండటం లేదు. దీంతో ఆ బిల్లు చూసి షాకయ్యా. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఇలాంటి పరిస్థితులు సిగ్గుచేటు(Shame). అయినప్పటికీ మనందరీకి ఒక అవకాశముంది. నా సోదరి, సోదరులను నేను కోరేది ఒక్కటే. ఇలాంటి సమస్యలపై మనమంతా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. చేతకాని ప్రభుత్వంపై పోరాడేందుకు రాష్ట్ర ప్రజలంతా ముందుకు రావాలి’ అని ఆమె వ్యాఖ్యానించారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ బోర్డు లిమిటెడ్ (హెచ్‌పీఎస్‌ఈబీఎల్) కంగనా రనౌత్ కరెంట్ బిల్లు వివాదంపై స్పందించింది. అసలు ఆమెకు వచ్చింది లక్ష రూపాయల బిల్లు కాదని తేల్చి చెప్పింది. ముఖ్యంగా హెచ్‌పీఎస్‌ఈబీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ.. ఎంపీ కంగనా రనౌత్ ఇంటికి వచ్చింది లక్ష రూపాయల బిల్లు కాదని.. రూ.55 వేలేనని తేల్చారు. అయితే 55 వేల రూపాయలు కేవలం ఈ నెల బిల్లు మాత్రమేనని కానీ ఆమె గతంలో చెల్లించని డబ్బులతో పాటు ఇతర బకాయిలు అన్నీ కలుపుకొని రూ. 91,100గా పూర్తి బిల్లు వచ్చిందని చెప్పారు.