end
=
Sunday, January 19, 2025
సినీమాబాలీవుడ్ 'క్వీన్‌'కు భారీ ఊరట
- Advertisment -

బాలీవుడ్ ‘క్వీన్‌’కు భారీ ఊరట

- Advertisment -
- Advertisment -

బాలీవుడ్‌ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు ముంబై హైకోర్టులో భారీ ఊరట లభించింది. ముంబైలోని కంగన ఆఫీసును బ్రిహన్‌ ముంబై కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు ఇటీవల కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆ చర్యను హైకోర్టు తప్పుపట్టింది. చట్ట ప్రకారం నిర్మించిన భవనాన్ని అక్రమంగా కూల్చేయడంపై మండిపడింది. బాధితురాలికి తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వ్యవహారంలో మహారాష్ట్ర సర్కారుపై కంగన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అనంతరం ముంబైలోని బాంద్రాలో ఉన్న కంగన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూల్చేశారు. కూల్చివేతపై కంగన ముంబై హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన హైకోర్టు కంగన కార్యాలయాన్ని కూల్చివేయడం చట్ట విరుద్ధమేనని తేల్చింది. కూల్చివేతపై స్టే విధించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -