end
=
Friday, April 25, 2025
సినీమాచిరంజీవికి ఢీకొట్టే విల‌న్‌గా ఆ కుర్ర హీరో?
- Advertisment -

చిరంజీవికి ఢీకొట్టే విల‌న్‌గా ఆ కుర్ర హీరో?

- Advertisment -
- Advertisment -

`సంక్రాంతికి వ‌స్తున్నాం` చిత్రంతో జోష్ మీదున్న‌ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Director Anil Ravipudi) తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Mega star Chiranjeevi)తో సినిమా ప్లాన్ చేశారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు కొబ్బ‌రికాయ కొట్టారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల(Producer Susmitha Konidela) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రం అచ్చం అనిల్ రావిపూడి కామెడీ మార్క్‌తో యాక్ష‌న్ ఎపిసోడ్స్ క‌ల‌గ‌లిసి ఉంటాయ‌ని టాక్‌. వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల కానున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకోనున్న‌ది.

అయితే.. తాజాగా ఓ హాట్ న్యూస్ ట్రెండింగ్‌(Trending news)లోకి వ‌చ్చింది. క్యాస్టింగ్ సంబంధించి ఒక అప్‌డేట్ మోగా అభిమానుల‌ను ఆక‌ర్షిస్తుంది. అదేంటంటే.. చిత్రంలో చిరంజీవిని ఢీకొట్టే ప్రతినాయక పాత్రను యువ క‌థానాయ‌కుడు కార్తికేయ గుమ్మ‌కొండ‌ను తీసుకుంటున్నారే ప్ర‌చారం ట్రెండింగ్ లో ఉంది. ‘ఆర్‌ఎక్స్100’ చిత్రంతో సంచ‌ల‌న స్టార్‌గా కార్తికేయ గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరంజీవి సూప‌ర్‌మూవీ `రాజ విక్రమార్క‌` పేరుతో కార్తికేయ ఓ సినిమాలో న‌టించాడు. సినిమా రిజ‌ల్ట్ ఏమైన‌ప్ప‌టికీ ఆ చిత్రానికి చిరు సైతం ప్ర‌చారంలో ఒక చేయి వేశారు.

మ‌రోవైపు కార్త‌కేయ త‌మిళ‌స్టార్ అజిత్‌కుమార్ న‌టించిన `వ‌లిమై` చిత్రంలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందాడు. ఇక చిరు చిత్రంలోనూ రాణిస్తే ఆ స్టార్ కెరీర్ ఇంకో రేంజ్‌కి వెళ్తుంద‌న‌డంలో సందేహం లేదు. కార్తికేయ ఎంపిక‌ను చిత్రం బృందం అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉన్న‌ది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -