- రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
- సాక్ష్యాలు దొరకకుండా పది ఫోన్లు పగలగొట్టినట్లు వెల్లడి
తెలంగాణలో (Telangana) ఒకవైపు షర్మిలా (Sharmila), కవిత (Kavitha), రేవంత్ రెడ్డి (Revanth reddy) మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor scam) రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పేరును ఈడీ (ED) అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఓ వైపు అరెస్ట్‌లు కొనసాగుతున్న వేళ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరో మలుపు తిరిగింది. రిమాండ్ రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate in remand report) ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టు (Amit Arora remand report) లో కవిత పేరును చేర్చింది. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితతోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Srinivasulu Reddy) పేర్లను ఈడీ రిపోర్టులో చేర్చింది.
ఈ మేరకు రూ. వంద కోట్లు అరేంజ్ చేసినవారిలో కవిత, ఎంపీ మాగుంట (MP Magunta) పేరు ఉన్నట్టు ఈడీ వెల్లడించింది. పది సెల్‌ఫోన్లను డ్యామేజ్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కాగా, అమిత్ అరోరాను ఇప్పటికే అరెస్ట్ చేసి ఈడీ పలుమార్లు విచారించింది. ఈ క్రమంలోనే కవిత పేరు రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చడం హాట్ టాపిక్‌గా మారింది. లిక్కర్ స్కామ్ (Liquor scam) ఎపిసోడ్‌లో సౌత్ గ్రూప్ (South Group) వంద కోట్ల ముడుపులు చెల్లించింది. వంద కోట్ల సమకూర్చిన వారిలో కవిత, మాగుంట పేర్లను చేర్చింది ఈడీ.
(Gujarat Election:గుజరాత్‌లో మొదలైన తొలి దశ ఫైట్)
అలాగే 36 మంది రూ.1.38 కోట్ల విలువైన 170 ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ స్పష్టం చేసింది. వీటిలో కవిత రెండు నెంబర్లు, 10 మొబైల్ ఫోన్లు వాడినట్లు ఈడీ వెల్లడించింది. కవిత వాడిన 10 ఫోన్ల ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. కవిత ధ్వంసం చేసిన ఫోన్లు, వాటి ఐఎంఈఏ (IKEA) నెంబర్లు, ఫోన్లు మార్చిన తేదీలను రిమాండ్ రిపోర్టులో ఈడీ బయటపెట్టింది. ఫోన్లు మార్చిన వారిలో శరత్‌రెడ్డి, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, సృజన్‌రెడ్డి (Sarath Reddy, Buchi Babu, Abhishek Boinapalli, Srujan Reddy) ఉన్నారని ఈడీ తెలిపింది. సృజన్‌రెడ్డి 3, అభిషేక్ బోయినపల్లి 5, బుచ్చిబాబు 6, శరత్ చంద్రారెడ్డి 9 ఫోన్లు మార్చినట్లు ఈడీ స్పష్టం చేసింది.
గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రకంనలు రేపుతున్న ‘ఢిల్లీ లిక్కర్ స్కామ్’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తొలిసారిగా కె కవిత పేరు అధికారికంగా బయటకు వచ్చింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు చేర్చిన పేర్లలో కల్వకట్ల కవిత (Kalvakathla అనే పేరు ఉంది. 32 పేజీల ఈ రిపోర్టులో (report of 32 pages) మూడు చోట్ల కె కవిత పేరును ప్రస్తావించారు. ఢిల్లీలో సంచలనం సృష్టించిన మద్యం కేసులో సౌత్ గ్రూపు నుంచి రూ. 100 కోట్లు తరలించినట్లు ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రైవేట్ విమానాల్లో డబ్బు తరలించినట్లు (As money was moved from Begumpet airport in private planes) అనుమానిస్తున్నారు. ఈ ‘సౌత్ గ్రూప్’ను శరత్ రెడ్డి, కె కవిత, మాగుంట నియంత్రించినట్లు తాజా రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం గమనార్హం.
అయితే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన అమిత్ అరోరా.. ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా (Former Delhi Minister Manish Sisodia)కు దగ్గరి వ్యక్తని తెలుస్తోంది. అమిత్ అరోరాను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు కోర్టును ఈడీ అనుమతి కోరనుంది. విచారణలో సేకరించిన వివరాల ఆధారంగా ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ప్రాథమిక దర్యాప్తులో అమిత్ అరోరా ఇచ్చిన వాగ్మూలంలో ధ్రువీకరించిన అంశాల ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ నివేదించినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు.
(YS Sharmila:ఆస్తులపై విచారణ చేపట్టే దమ్ముందా)