end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంకేసీఆర్ రుణం తీర్చలేనిది
- Advertisment -

కేసీఆర్ రుణం తీర్చలేనిది

- Advertisment -
- Advertisment -

దౌల్తాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రుణం తీర్చలేనిదని సీఎం రీలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందుకున్న అర్హులు అన్నారు. వివరాలు చూస్తే.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు చెక్కుల పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఓడినా, గెలిచినా ప్రజల మధ్యలోనే ఉంటుందని అని తిరుమలాపూర్ ఎంపీటీసీ బండారు దేవేందర్ అన్నారు. మంగళవారం తిరుమలాపూర్ గ్రామంలో లక్షా 39 వేల రూపాయల సీఎం రిలీఫ్‌ ఫండ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడ్డమీది భాగ్య, ఎంపీటీసీ బండారు దేవేందర్ చేతుల మీదుగా రంగన్న గారి వెంకటరెడ్డికి 60 వేల రూపాయలు, కొండయ్య స్వామికి 45 వేల రూపాయలు, జనగామ నర్సింలుకు 20 వేల రూపాయలు, శ్యామలకు 14 వేల రూపాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పడాల నాగేష్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రమేష్ గౌడ్, గడ్డమీది సత్తయ్య, నీరుడి సత్తయ్య, నాగరాజు, రాజు, వార్డు సభ్యులు లక్ష్మి, కోఆప్షన్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, గ్రామ సెక్రెటరీ నరేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -