end

CM KCR:మూడేళ్ల తర్వాత ఏపీకి కేసీఆర్

CMKCR : అక్టోబరు 14 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహాసభల్లో(CPI National Conference)  పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) విజయవాడ కి రానున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత చాడ వెంకట్‌రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు.ఈ సమావేశాలకి కేరళ, బిహార్‌ ముఖ్యమంత్రులు పినరయి విజయన్‌, నితీశ్ కుమార్‌‌తో హాజరుకానున్నారు. వీరితోపాటు 20 దేశాల నుంచి కమ్యూనిస్ట్ నేతలు హాజరుకానున్నారు.

నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వం ఏర్పడ్డాక నియంతృత్వ పాలన సాగుతుందని ఇప్పుడు జరగబోయే సమావేశల్లో దేశాన్ని నిర్దేశించే రాజకీయ తీర్మానం తీసుకొస్తామని ఆ పార్టీ నేతలు తెలియచేసారు. ఏపీ సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా అమరావతిని (Amaravathi) రాజధాని(Capital)గా ఒప్పుకున్న జగన్‌మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) ఇప్పుడు మూడు రాజధానులనడం సబబుకాదన్నారు. మూడు రాజధానులపై ఏపీ శాసనసభలో చర్చ పెట్టడంపై అసహనం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project) ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం, కేసీఆర్ ని 2019, జూన్ 17న జగన్‌ని ఆహ్వానించారు. ఆ సందర్భంలోనే ఇంద్రకీలాద్రిపై(Indra Keeladri) ఉన్న కనకదర్గ (Godess Kanakadurga Ammavaru) అమ్మవారిని దర్శించుకున్నారు.

Exit mobile version