end

దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ తెచ్చిన గొప్ప కార్యక్రమం

దళిత బంధు ఒక పథకం మాత్రమే కాదని, అదొక ఉద్యమం అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. వాసాలమర్రిలో దళితబంధు ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్బంగా సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం బుడ్డాయిపల్లి దళిత బంధు లబ్ధిదారులు శుక్రవారం అరణ్య భవన్ లో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ వల్ల తాము ఈరోజు మంచి స్థాయికి చేరుకున్నట్లు మంత్రికి వివరించారు. లబ్దిదారులు పొందిన గేదెల ద్వారా వచ్చిన జున్నును మంత్రికి తినిపించి సంబురం పంచుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. దళిత బంధు ప్రకటించి ఏడాది కావడంతో పండుగ వాతావరణం నెలకొంది అన్నారు. లబ్దిదారులు ఈరోజు ఉపాధి పరంగా నిలదొక్కుకోవడం సంతోషకరం అన్నారు. దళిత బందు మీద ఉన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయని, అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభం అయ్యింది అన్నారు. దశల వారీగా రాష్ట్రంలో అర్హులైన దలితులందరికీ దళిత బంధు అందించాలనేది సీఎం కేసీఆర్ సంకల్పం అన్నారు.

దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఇక్కడ పథకం అమలు జరుగుతున్నారు. దళితుల ఎదుగుదలకు తోడ్పడాలని, డైట్, శానిటేషన్, వైన్స్ తదితర టెండర్లలో రిజర్వేషన్ కల్పించినట్లు చెప్పారు. దళిత కుటుంబాలకు దళిత బంధు ఏడాది పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ తోడ్పాటును అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే క్రాంతి మాట్లాడుతూ.. దళితుల ఎదుగుదలకు గతంలో ఏ ప్రభుత్వం చేయని గొప్ప కార్యాన్ని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని టి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిందని అన్నారు. దళితబందు అనే బృహత్తర పధకం తీసుకొచ్చి మా బతుకుల్లో మార్పు తెచ్చిండు.. అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిండు.. ఆ వర్గం బతుకులనే మార్చేసిండు అని చెప్పారు.

తమ జీవితాలింతే ఇక మారవేమో అనుకున్నాము కానీ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధుతో మా నసీబ్ మారిపోయిందంటున్నారు. ప్రభుత్వం చేసిన ఈ సాయానికి దళితవర్గం అంతా రుణపడి ఉంటుందన్నారు. ఈ పథకం అమలులో ప్రత్యేక చొరవ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు.. ఎమ్మెల్యే క్రాంతికిరణ్, నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు బిక్షపతి, వట్ పల్లి జెడ్ పి టి సీ పత్రి అపర్ణ, వరం అధ్యక్షులు వీరారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, నాయకులు సాయి కుమార్, విఠల్ , సదానందం, దళిత బందు లబ్దిదారులు పాల్గొన్నారు

Exit mobile version