end

మంకీపాక్స్‌తో కేరళ యువకుడు మృతి

  • కేంద్రం కీలక నిర్ణయం

కరోనా వైరస్‌ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితుల్లో మళ్లీ దేశంలో మంకీ పాక్స్‌ వైరస్‌ కలవరపెడుతోంది. తాజాగా దుబాయ్‌ నుండి కేరళ వచ్చిన యువకుడు మంకీపాక్స్‌ లక్షణాలతో మృతి చెందినట్లు నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం ఈ మంకీపాక్స్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. నీతి అయోగ్‌ సభ్యుడు డా.వికె పాల్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. మంకీపాక్స్‌ నియంత్రణకు వాక్సినేషన్‌పై సూచనలు ఇవ్వనున్నారు. కాగా దేశంలో ఇప్పటి వరకు నాలుగు మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఉ‍న్న 15 ఐసీఎంఆర్ ల్యాబుల్లో మంకీపాక్స్‌ పరీక్షలు నిర్వహించేలా సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

ప్రపంచాన్ని వణికిస్తున్నా మంకీపాక్స్
Exit mobile version