end

కార్పొరేటర్‌ వాహనానికి నిప్పు

  • యువకుడి మృతికి కార్పొరేటర్‌ రామ్మూర్తి కారణమని ఆరోపణ

అనుమానాస్పదంగా మృతి చెందిన ఓ యువకుడి బంధువలు ఖమ్మం నగరంలో నానా రభస సృష్టించారు. బంధువులు, కుటుంబ సభ్యులు ఏకంగా కార్పోరేటర్‌ వాహనాన్ని తగులబెట్టారు. నగరంలోని 1వ డివిజన్‌ కైకొండాయగూడెంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 18న తేజ్‌ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు.

నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

అయితే ఆ యువకుడి మృతికి కారణం కార్పోరేటర్‌ రామ్మూర్తియేనని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఆ సమయంలో కార్పోరేటర్‌ రామ్మూర్తి ఆందోళన చేస్తున్న స్థలానికి రావడంతో కోపోద్రిక్తులైన తేజ్‌ కుటుంబ సభ్యులు, బంధువులు కార్పోరేటర్‌తో గొడవ పడ్డారు.

కరోనా వైరస్‌ను నియంత్రించాకే వ్యాపారాలు

దీంతో కార్పోరేటర్‌ రామ్మూర్తి అక్కడే ఉన్న పాఠశాలలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. వెంటనే పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని రామ్మూర్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు కార్పొరేటర్‌ కారును తరలించే సమయంలో బాధిత కుటుంబ సభ్యులు వాహనానికి నిప్పు అంటించారు. దీంతో వాహనం పూర్తిగా దగ్దమైంది. పోలీసులు ఏసీపీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకారులను చెదగొట్టారు.

భారీగా ఉగ్రవాదుల ఆయుధాలు పట్టివేత

Exit mobile version