బీజేపీ నాయకురాలు, ప్రముఖ సినీనటి ఖుష్బూ సుందర్ పెనుప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు ఓ కంటైనర్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఆక్సిడెంట్ జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనానంతరం ఖుష్బూ ట్విట్టర్‌లో తన అనుభవాల్ని పంచుకున్నారు. అభిమానుల ఆశీస్సులు, దేవుడి దీవెనలు ఉన్నందువల్లే ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డానని పేర్కొన్నారు. తన క్షేమం కోరిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఙతలు తెలియజేస్తున్నానని ఆమె వెల్లడించారు.