- ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతం
- కోల్‌కత్తా నుంచి హైదరాబాద్‌కు ఊపిరితిత్తులు
చండీఘర్‌కు చెందిన ఓ వ్యక్తి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసిపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో తెలంగాణ జీవన్‌ధాన్ పౌండేషన్ పశ్చిమబెంగాళ్ రాష్ర్టంలోని జనరల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్(రోటో) పూర్తి సమన్వయంతో వ్యవహరించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడాయి. కోల్‌కత్తాలో బ్రెయిన్‌డెడ్ అయిన ఓ యువకుని ఊపరితిత్తులను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పిటల్‌కు తీసుకొచ్చారు. పశ్చిమబెంగల్, తెలంగాణ ట్రాఫీక్ పోలీసులు ఆసుపత్రి నుంచి విమానశ్రయం వరకు గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేయడం ద్వారా ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఊపిరితిత్తులు కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నాయి. పశ్చిమబెంగల్‌లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఊపిరితిత్తులు తీయడం ఆ రాష్ర్టం నుంచి వేరే రాష్ర్టానికి అవయవాలు రావడం ఇదే మొదటిసారి. ఇప్పుడిప్పుడే ఆ రాష్ర్టంలో అవయవదానంపై అవగాహన పెరుగుతుందని అక్కడి వైద్యులు తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ కోల్‌కత్తాలో చికిత్స పొందుతున్న ఓ యువకుడిని బ్రెయిన్ డెడ్ అని శనివారం ప్రకటించారు. అతని బంధువులు అవయవధానంకు ముందుకు రావడంతో ఈ విషయాన్ని రోటోకు తెలియజేశారు. అప్పటికే హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి ఊపిరితిత్తులు అవసరమని తెలంగాణ జీవన్‌ధాన్ ఫౌండేషన్ ఇన్‌చార్జి డాక్టర్ స్వర్ణలత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అవయవదాన సమన్వయ సంస్థలకు తెలియజేయడంతో ఊపిరితిత్తులను ఇక్కడికి పంపాలని నిర్ణయించారు. ఈ విషయంలో రోటో తూర్పుజోన్ డైరెక్టర్ డాక్టర్ మణియమ్, బందోపాధ్యాయ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్పితా ఎంతో సహాయం చేశారు. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 10రోజులలో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స చేయడంలో ఇది రెండోసారి.