end

కింగ్స్‌ విక్టరీ‌.. ధావన్‌ సెంచరీ వృధా

  • రాణించిన పూరన్‌, మ్యాక్స్‌వెల్‌

సినిమాల్లోకి రాకుంటే పోలీసయ్యేవాడిని..

165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట సూపర్‌ ఫామ్‌లో ఉన్న రాహుల్‌(15 పరుగులు)ను అక్సర్‌ పటేల్‌ ఔట్‌ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన క్రిస్‌ గేల్‌(13 బంతుల్లో, 29; 3 ఫోర్లు, 2సిక్సర్లు) మంచి టచ్‌లో కనిపించాడు. కానీ, అతడిని రవిచంద్రన్‌ అశ్విన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. గేల్‌ ఔట్ అయిన కాసేపటికే ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(5 పరుగులు).. పూరన్‌తో చిన్న మిస్‌ అండర్‌స్టాండింగ్‌తో రన్‌ ఔట్‌గా వెనుదిరిగాడు.

ముంపు బాధితులకు రూ.10వేల తక్షణ సహాయం

తర్వాత పూరన్‌(28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు)కు జతకలిసిన మ్యాక్స్‌వెల్‌(32 పరుగులు; 3 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. జట్టును గెలుపు అంచుల్లోకి తెచ్చారు. వీరిద్దరినీ రబాడా వెంటవెంటనే పెవిలియన్‌కు పంపినప్పటికీ.. దీపక్‌ హుడా(15 పరుగులు), నీషమ్‌ (10 పరుగులు) మరో ఓవర్‌ మిగిలి ఉండగానే లాంఛనాన్ని పూర్తి చేశారు. ఢిల్లీ బౌలర్లలో రబాడ 2 వికెట్లు, అక్సర్‌ పటేల్‌, అశ్విన్‌ చెరో వికెట్ పడగొట్టారు.

నిషేధిత గుట్కా ప్యాకెట్లు సీజ్‌

అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు శిఖర్‌ ధావన్‌(106) సెంచరీ సాయంతో 164 పరుగులు చేసింది. మిగితా బ్యాట్స్‌మెన్‌ ఎవ్వరూ అనుకున్నంతగా రాణించలేదు. ఒకట్రొండు మంచి పార్ట్‌నర్‌షిప్‌లు వచ్చినా స్కోరు 200 మార్కును చేరేది. సూపర్‌ సెంచరీతో ఆకట్టుకున్న ధావన్‌ను మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి భారీ చోరి

కాగా, ఈ విజయంతో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్టు పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పరుచుకుంది. 7వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకింది.

Nokia 215 4G, 225 4G VoLTE మొబైల్స్‌ విడుదల

Exit mobile version