end
=
Sunday, January 19, 2025
క్రీడలుకోహ్లి అసాధ్యుడు: మార్క్‌ టేలర్‌
- Advertisment -

కోహ్లి అసాధ్యుడు: మార్క్‌ టేలర్‌

- Advertisment -
- Advertisment -

క్రికెట్‌లో కోహ్లి అసాధ్యుడని, అతనో ధృఢమైన వ్యక్తని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి. అతడు మైదానంలో దూకుడుగా ఉంటే సహచరులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుందన్నాడు. జట్టును ముందుండి నడిపించే అత్యుత్తమ కెప్టెన్‌ కోహ్లి అని టేలర్‌ అభిప్రాయపడ్డారు. తను బాగా ఆడుతూ.. తోటి ఆటగాళ్లకు ప్రేరణ కలిగిస్తాడు కోహ్లి. అలాంటి ఆటగాడిని తానిప్పటివరకు చూడలేదని మార్క్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించే కోహ్లి.. ఆటను కూడా అంతే సమానంగా గౌరవిస్తాడని ఆయన తెలిపారు. ఈ సిరీస్‌లో కోహ్లి సరికొత్త రికార్డులు సృష్టించడం కాయమంటున్నాడు ఈ ఆసీస్‌ మాజీ కెప్టెన్‌. ప్రస్తుతం ఆసీస్‌లోనే ఉన్న టీమిండియా.. త్వరలోనే ఆస్ట్రేలియాతో మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడనుంది.

కోహ్లి లేకపోవడం ఇండియాకు దెబ్బే..
ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లి.. ఆసీస్‌తో తలపడే చివరి మూడు టెస్టులకు అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ అంటున్నాడు ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌. కోహ్లి లాంటి ఆటగాడు ఫీల్డ్‌లో ఉంటే ఆ ఉత్సాహం వేరే లెవెల్‌లో ఉంటుదన్నాడు. ఆసీస్‌ ఆటగాళ్లు కూడా కోహ్లి ఉంటేనే సిరీస్‌కు మజా ఉంటుందని అభిప్రాయపడ్డారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో కోహ్లి ఒక టెస్టు మాత్రమే ఆడతాడు. అనంతరం తన భార్య డెలవరీ కోసం ఇండియా రానున్నాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -