end

కోహ్లి మరో రికార్డు..

రికార్డుల కింగ్‌, భారతజట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కోహ్లి 89 పరుగులు చేశాడు. దీంతో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌ కేరీర్‌లో 22వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా 22వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. సచిన్‌ టెండూల్కర్‌ 493 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకోగా.. కోహ్లి మాత్రం కేవలం 462 మ్యాచుల్లోనే ఈ ఫీట్‌ సాధించాడు. వీరి తర్వాత బ్రియాన్‌ లారా(511), ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌(514) ఉన్నారు. విరాట్‌ టెస్టుల్లో 7,240 పరుగులు, వన్డేల్లో 11,977 పరుగులు, టీ 20ల్లో 2,794 పరుగులు సాధించాడు.

Exit mobile version