end
=
Sunday, January 19, 2025
క్రీడలుటాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లి
- Advertisment -

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లి

- Advertisment -
- Advertisment -

సిడ్నీ: భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లి వరుసగా రెండోసారి టాస్ నెగ్గాడు. టాస్‌ అనంతరం కోహ్లి ఛేదనకే మొగ్గు చూపాడు. క్రితం మ్యాచ్‌లోనూ టాస్‌ గెలిచిన కెప్టెన్ కోహ్లి ఛేజింగ్‌కే ప్రాధాన్యతనిచ్చాడు. ఎందుకంటే తను ఛేదనలో మొనగాడు కదా. దీంతో ఆతిథ్య ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ చేయనుంది. ఈ మ్యాచ్‌ ఎలాగైనా గెలిచి, సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని భారత్‌ ఉవ్విళ్లూరుతోంది. వన్డేలతో పోలిస్తే.. టీ ట్వంటీల్లో భారత బ్యాటింగ్‌ లైనప్‌ పూర్తిగా గాడిలో పడిందని చెప్పవచ్చు. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రాహుల్ జట్టుకు శుభారంభాలిస్తున్నారు. కెప్టెన్ కోహ్లి పూర్తిగా టచ్‌లోకి వచ్చాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ రాణించాల్సి ఉంది. ఆల్‌రౌండర్‌ హార్ధిక్ పాండ్యా చివరి మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించి, మ్యాచ్‌ను గెలిపించాడు.

బౌలింగ్‌ యువ సంచలనం, యార్కర్‌ కింగ్‌ నటరాజన్ సూపర్‌గా బౌలింగ్ చేస్తున్నాడు. అతనికి దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చక్కటి సహకారం అందిస్తున్నారు. స్పిన్నర్లు చాహల్, సుందర్‌ పొదుపుగా బౌలింగ్ చేస్తే ఆసీస్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయవచ్చు. కాగా, భారత్‌కిది కంటిన్యూగా ఏడో టీ20 సిరీస్‌ విజయం.

ఆసీస్‌ విషయానికొస్తే.. గత మ్యాచ్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. అతను వన్డేలతో సహా తొలి టీ ట్వంటీలోనూ భారీగా పరుగులు సాధించాడు. మ్యాక్స్‌వెల్‌, వేడ్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపితే ఇండియా సగం విజయం సాధించినట్లే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -