end
=
Wednesday, January 22, 2025
క్రీడలుకోహ్లి నిర్ణయం సరైనదే: కోచ్‌ రవిశాస్త్రి
- Advertisment -

కోహ్లి నిర్ణయం సరైనదే: కోచ్‌ రవిశాస్త్రి

- Advertisment -
- Advertisment -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో కేవలం ఒక టెస్టు మాత్రమే అందుబాటులో ఉంటాడు . అనంతరం అతను వెటర్నరీ లీవ్‌పై స్వదేశానికి తిరిగిరానున్నాడు. కాగా, కెప్టెన్ కోహ్లి నిర్ణయం సరైనదే అంటున్నాడు టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి. తన నిర్ణయాన్ని అందరం గౌరవించాలని ఆయన విన్నవించారు. కోహ్లి గైర్హాజరీ జట్టుకు పెద్ద దెబ్బే. కానీ, యువ ఆటగాళ్లకు మంచి అవకాశం కూడా అని ఆయన అన్నారు. ఆస్ట్రేలియా టూర్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని కచ్చితంగా మిస్సవుతామని హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. అయితే ప్రస్తుతం జట్టులో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఉన్నారని, కోహ్లి నిర్ణయం వల్ల తమను తాము నిరూపించుకునే అవకాశం వారికి దక్కిందని పేర్కొన్నాడు.

కాగా, కోహ్లి సతీమణి, హీరోయిన్‌ అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రసవ సమయంలో భార్యకు తోడుగా ఉండేందుకు అతడు పితృత్వ సెలవు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 17న మొదలయ్యే తొలి టెస్టు తర్వాత కోహ్లి స్వదేశానికి తిరిగి రానున్నాడు. దీంతో ఆసీస్‌తో జరిగే కీలకమైన టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో కోహ్లి నిర్ణయం.. ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని మరోసారి సొంతం చేసుకోవాలన్న టీమిండియా బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపనుందని క్రికెట్‌ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -