end

Kommineni Srinivasa Rao : ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావు

kommineni Srinivasa rao

ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా(Andhrapradesh Press Academy Chairman) సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావును(Kommineni Srinivasa Rao) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మినేని శ్రీనివాసరావు ఈ పదవిలో రెండేళ్లుపాటు కొనసాగునున్నారు. అంతేకాదు కేబినెట్ హోదా(Cabinet Position) సైతం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు పలు మీడియా సంస్థల్లో పనిచేశారు. అయితే 2019 ఎన్నికలకు ముందు నుంచి సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan)సొంత చానెల్‌లో పనిచేస్తున్నారు. వైఎస్ జగన్, వైసీపీ (YSR Congressparty) తరఫున గట్టిగా గళం వినిపిస్తూ వచ్చారు.

(Srisailam: శ్రీశైలంలో జ్యోతిర్లింగ దర్శనం నిలిపివేత)

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చానెల్(Sakshi TV) తరపున ప్రతీ జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేయడంలో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన సమావేశాలు కూడా ఎంతో సహకరించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కొమ్మినేని శ్రీనివాసరావుకు కీలక పదవి ఖాయమని అంతా భావించారు. కానీ మూడున్నరేళ్ల తర్వాత పదవి కట్టబెట్టారు. ఇప్పటివరకూ ఈ పదవిలో ఉన్న దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి (Devireddy Sreenath Reddy) పనిచేశారు.

సీనియర్‌ జర్నలిస్టు లక్ష్మారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

Exit mobile version