end

Kotak Mahindra Bank:ఎఫ్‌డీల వడ్డీ రేట్లు పెంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్!


భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) RBI తాజాగా కీలక రెపో రేటు (Repo rate)ను వరుసగా ఐదోసారి పెంచడంతో బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఆర్‌బీఐ రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit)లపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు శుక్రవారం(డిసెంబర్ 9) నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు వెల్లడించింది. వివిధ కాలవ్యవధులను బట్టి డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. సాధారణ ఖాతాదారుల కంటే సీనియర్ సిటిజన్ల (Senior citizens)కు అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది.

బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. సవరించిన వడ్డీ రేట్లు.. 7-14 రోజుల కావ్యవధితో చేసే డిపాజిట్లపై 2.75 శాతం, 15-30 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం, 31-45 రోజుల ఎఫ్‌డీ (FD)లపై 3.25 శాతం, 46-90 రోజుల ఎఫ్‌డీకి 3.50 శాతం, 91-120 రోజుల కాలవ్యవధిపై 4 శాతం, 121-179 రోజుల ఎఫ్‌డీలపై 4.25 శాతం, 180-270 రోజుల కాలవ్యవధి ఉన్న ఎఫ్‌డీలకు 5.50 శాతం, 271-360 రోజుల ఎఫ్‌డీలపై 5.75 శాతం, 364 రోజుల ఎఫ్‌డీలకు 6 శాతం, 2 ఏళ్లలోపు ఎఫ్‌డీలకు 6.50 శాతం వడ్డీ లభించనుంది. తక్కువ కాలవ్యవధి ఉండే ఎఫ్‌డీలను ముందుగా ఉపసంహరించుకునే ఎలాంటి జరిమానా ఉండదని బ్యాంకు తెలిపింది. 180-364 రోజుల ఎఫ్‌డీలను ముందుగా తీసుకుంటే 0.50 శాతం, ఏడాది కంటే ఎక్కువ ఉండే ఎఫ్‌డీలను ముందుగా తీసుకుంటే 1 శాతం జరిమానా ఉంటుందని పేర్కొంది.

(Himachal pradesh:హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు)

Exit mobile version