భారత్‌లో కరోనా కేసుల సంఖ్య దాదాపు కోటికి చేరింది. గడిచిన 24 గంటల్లో45,209 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ కేసులతో కలుపుకొని ప్రస్తుతానికి కోవిడ్ కేసుల సంఖ్య 90,95,807కు చేరుకుంది. ఇందులో40,962 మంది కరోనాతో పోరాడుతున్నారు. 85,21,617 మంది కోలుకున్నారు. ఇటీవల 501మంది కోవిద్ కారణంగా మరణించగా.. ఆ సంఖ్య1,33,227కు చేరింది. భారత్‌లో 50వేల కంటే తక్కువ కేసులు నమోదు కావడం ఇది వరుసగా 15వ రోజు కావడం విశేషం. నవంబర్ 7కే చివరిసారి 50వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 80, 878 మంది చికిత్స పొందుతున్నారు. తర్వాత కేరళలో 66,982, ఢిల్లీలో 39,741 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఐసీఎమ్‌ఆర్ ప్రకారం.. నిన్న ఒక్కరోజే10,75,326 కరోనా టెస్టులు చేయగా, ఆ సంఖ్య 13,17,33,134కు చేరింది.